సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. రూ. 99లకే టికెట్స్.. ఆ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్..
కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు సాధారణ టికెట్ పై దాదాపు 100 నుంచి 120 రూపాయిల వరకు పెంచేస్తున్నారు. దాంతో చాలా మంది థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీల్లో వచ్చినప్పుడు చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా బడా హీరోల సినిమాలు వస్తే చాలు ఓపినింగ్స్ పెంచుకోవడానికి.. కలెక్షన్స్ చూపించుకోవడానికే మేకర్స్ మొదటి పదిరోజులు టికెట్ ధరలు పెంచేస్తున్నారు.
ప్రస్తుతం సినిమా టికెట్ రేట్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న చిన్న థియేటర్స్‌లో పర్లేదు కానీ మల్టీప్లెక్స్‌లు మాత్రం టికెట్ రేట్లతో ప్రేక్షకులను బెదరగొడుతున్నాయి. ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయంటే చాలు సాధారణ టికెట్ పై దాదాపు 100 నుంచి 120 రూపాయిల వరకు పెంచేస్తున్నారు. దాంతో చాలా మంది థియేటర్స్‌కు వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీల్లో వచ్చినప్పుడు చూడటమే బెటర్ అనుకుంటున్నారు. ముఖ్యంగా బడా హీరోల సినిమాలు వస్తే చాలు ఓపినింగ్స్ పెంచుకోవడానికి.. కలెక్షన్స్ చూపించుకోవడానికే మేకర్స్ మొదటి పదిరోజులు టికెట్ ధరలు పెంచేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు థియేటర్స్ యాజమాన్యాలు ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాయి.
ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!
కేవలం రూ. 99 సినిమా టికెట్స్ అంటూ ఓ ఆఫర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. కానీ ఈ ఆఫర్ ఒక్క రోజు మాత్రమే.. కు నేషనల్ సినిమా డేను పురస్కరించుకొని సెప్టెంబర్ 20న దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్స్ లో టికెట్ ప్రైజ్ కేవలం రూ. 99 మాత్రమే ఉండనుంది. ఈమేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 4000కు పైగా థియేటర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. కాగా ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ ఉన్న థియేటర్స్ లో ఈ ఆఫర్ వర్తించదు. అలాగే పీవీఆర్ ఐనాక్స్, సినీపోలీస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్, మూవీ టైమ్,డిలైట్ వంటి థియేటర్స్ లో ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.. ఆ ఒక్క రోజు అన్ని షోలకు ఇది వర్తిస్తుందని అనౌన్స్ చేశారు.
ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.