Tollywood: అయ్య బాబోయ్.. నువ్వే కావాలి నటి వర్ష.. ఎంతలా మారిపోయిందో

తెలుగులో ప్రముఖ దర్శకుడు కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించిన “నువ్వే కావాలి” చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “మాధవి అలియాస్ వర్ష” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తోంది..?

Tollywood: అయ్య బాబోయ్.. నువ్వే కావాలి నటి వర్ష.. ఎంతలా మారిపోయిందో
Actress Varsha
Follow us

|

Updated on: Jun 09, 2024 | 4:37 PM

నువ్వే కావాలి సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్. నైన్టీస్ కిడ్స్ ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటారు. ‘కళ్లలోకి కళ్లు పెట్టి చూడవెందుకు’… ‘ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది..చెలీ ఇదేం అల్లరి’…. ‘అనగనగ ఆకాశం ఉంది.. ఆకాశంలో మేఘం ఉంది’ పాటలు అప్పటికీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ అంతే. తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా 2000లో విడుదలైన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురపించింది. తరుణ్, రిచా ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించినవారే.. పెరిగి పెద్దయ్యాక.. లీడ్ రోల్స్‌లో ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. చలపతి రావు, సునీల్, ఎంఎస్ నారాయణ, సాయి కిరణ్, వర్ష, కోవై సరళ లాంటి వాళ్లు సినిమా స్థాయిని మరింత పెంచారు. కాగా సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించడం విశేషం.

ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించగా, స్రవంతి రవి కిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. కుటుంబ కథా చిత్రాల డైరెక్టర్ విజయ్ భాస్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. నీరమ్ అనే మలయాళ మూవీ నుండి రీమేక్ అయిన ఈసినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో సందడి చేసి.. రికార్డులు బద్దలుకొట్టింది. పదే, పదే ప్రేక్షుకులు థియేటర్లకు వచ్చారంటే సినిమా కంటెంట్ వారికి ఎంత నచ్చిందో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా కాలేజ్ సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. తరుణ్, రిచాల స్నేహం.. ఆపై ప్రేమగా మారే విధానం.. వారి మధ్య ఎమోషన్స్ ఈ సినిమా స్థాయిని పెంచేశాయి. ఇందులోనే తరుణ్‌ని ప్రేమిస్తూ ఉండే వర్ష క్యారెక్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరో పలకరించడంగానే తను కిందపడిపోతుంది.. ఆ తర్వాత తానే ‘సారీ’ చెబుతూ ఉంటుంది. చాలా అమాయకంగా కనిపిస్తూ.. ఫ్యూర్ లవ్ ప్రదర్శించే ఆమె తత్వం అందరూ తెగ నచ్చేస్తుంది. ఇందులో వర్ష క్యారెక్టర్ చేసిన ఆ నటి పేరు కూడా వర్షానే.

అంతకు ముందు చాలా చిత్రాల్లో నటించినా ఈ మూవీతో ఆమెకు మంచి నేమ్ అండ్ ఫేమ వచ్చింది. వర్ష అసలు పేరు మాధవి. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది. హీరోహీరోయిన్లకు సోదరిగా, ఫ్రెండ్‌గా అనేక సినిమాల్లో మెప్పించింది. ఆహా, తమ్ముడు, సుస్వాగతం, సూర్యవంశం వంటి సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయగా.. నువ్వే కావాలితో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్ర చేసింది. మంచి గుర్తింపే వచ్చినప్పటికీ.. ఆమెకు హీరోయిన్ పాత్రలు మాత్రం రాలేదు. నువ్వు వస్తావని, ప్రియమైన నీకులో మంచి పాత్రలు దక్కాయి. మరోసారి ఆమెకు మంచి పేరు తెచ్చిన చిత్రం సింహరాశి. ఇందులో రాజశేఖర్ చెల్లెలిగా నటించి..ప్రశంసలు దక్కించుకుంది. వాసులో వెంకటేశ్ చెల్లెలిగా మంచి నటనను కనబరిచింది.

దొంగోడు, సత్యం, దొంగ దొంగది, మాస్, కాశీ, నాయకుడు వంటి సినిమాల్లో కనిపించింది. సినిమాలకు దూరమైన ఆమె బుల్లితెరపై సందడి చేస్తోంది. మనసు మమత, కస్తూరి, అత్తారింటికి దారేది, మట్టిగాజులు అనే ధారావాహికలు. ఆహాలో స్ట్రీమింగ్ అయిన మందాకినీ అనే ఓటీటీ సీరియల్లోనూ కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన షూటింగ్ వీడియోలు, తోటి నటులతో కలిసి రీల్స్ చేస్తూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. 20 ఏళ్ల క్రితం వెండితెరను విడిచిపెట్టిన ఈమె.. మళ్లీ వెండితెరపై సందడి ఎప్పుడు చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
వైరల్ అవుతున్న మరో ట్రెండీ ఆప్టికల్ ఇల్యూషన్.. కనిపెట్టండి చూద్దా
వైరల్ అవుతున్న మరో ట్రెండీ ఆప్టికల్ ఇల్యూషన్.. కనిపెట్టండి చూద్దా
పాపం బిడ్డ .. వెరైటీగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు..కానీ ఇలా..
పాపం బిడ్డ .. వెరైటీగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు..కానీ ఇలా..
సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగా మ్యూజికల్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'
సెన్సేషన్ క్రియేట్ చేసిన మెగా మ్యూజికల్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్'
వయనాడ్‌, రాయ్‌బరేలీ వైపు అందరి చూపు..ఆ సీటును వదులుకోనున్న రాహుల్
వయనాడ్‌, రాయ్‌బరేలీ వైపు అందరి చూపు..ఆ సీటును వదులుకోనున్న రాహుల్
Video: బార్బడోస్‌లో అర్థనగ్నంగా టీమిండియా ఆటగాళ్లు..
Video: బార్బడోస్‌లో అర్థనగ్నంగా టీమిండియా ఆటగాళ్లు..
31సార్లు సందర్శించి.. 72శాతం పోలవరం పనులు పూర్తి చేశా'.. ఏపీ సీఎం
31సార్లు సందర్శించి.. 72శాతం పోలవరం పనులు పూర్తి చేశా'.. ఏపీ సీఎం
సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు,ద‌ర్శ‌న టికెట్ల కోటారిలీజ్
సెప్టెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు,ద‌ర్శ‌న టికెట్ల కోటారిలీజ్
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ..
ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..
ఇంట్లోనే ఈజీగా మసాలా మొక్కలను పెంచేయండిలా..
దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?
దీపికాకు బంపర్ ఆఫర్.. బిగ్ బాస్ సీజన్ 8‌లో బ్రహ్మముడి నటి..?
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
చంద్రబాబును చూసైనా రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి.. హరీష్ రావు
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
నన్ను నేనే మిస్ అవుతున్నాను.. హార్ట్‌ ను టచ్ చేస్తున్న సేతుపతి..
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
హ్యాట్సాఫ్..రవితేజ గారు.! తీవ్ర మెడనొప్పి లెక్కచేయని మాస్‌రాజా..!
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
స్టార్ హీరోయిన్ ఘరానా మోసం.? కోర్టుకెక్కిన వ్యాపారి..
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
హజ్‌ యాత్ర ప్రారంభం.. 48 డిగ్రీల ఉష్ణోగ్రత ఎడారిలో యాత్ర.!
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదులు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రాణాలకు తెగించి కాపాడాడు.. ఆపై పొట్టుపొట్టుగా కొట్టాడు..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు పూర్తి.. మన దగ్గరే..
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పోకిరీ బ్యాచ్‌ వీరంగం. ఇంటి ఓనర్ పై దాడి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.
అదుపు తప్పి అలకనంద నదిలో పడ్డ టెంపో.. 8 మంది మృతి.