- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Son Akira Nandan have an unforgettable gift to His father Telugu Heroes Photos
Akira Nandan: తండ్రికి మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన అకీరా నందన్.. మురిసిపోతున్న పవన్.
పవన్ కళ్యాణ్ గెలిచాక అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు.. అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు. కానీ వాళ్లందరి కంటే ముందే పవన్ తనయుడు అకీరా నందన్.. నాన్నకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. కాకపోతే అది బయటికి రాలేదంతే. ఆర్నెళ్ళ ముందే అకీరా ఇచ్చిన గిఫ్ట్‌ను ఇప్పుడు రేణు దేశాయ్ అభిమానులకు చూపించారు. మరి పవన్‌కు అకీరా ఇచ్చిన బహుమతేంటి.? గత రెండ్రోజులుగా పవన్ కళ్యాణ్‌తో పాటు అకీరా నందన్ పేరు కూడా వైరల్ అవుతుంది.
Updated on: Jun 09, 2024 | 4:51 PM

రాజకీయంగా ఇకపై తాను బిజీ అవుతానని తెలిసే.. అకీరా నందన్‌ను ఆడియన్స్‌కు చేరువ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొన్నటి వరకు అరుదుగా కనిపించిన అకీరా.. ఎన్నికల తర్వాత తండ్రి దగ్గరే ఉన్నారు.

అకీరా అరంగేట్రానికి సమయం ఆసన్నమైందా..? ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నపుడు.. ఆ బరువును వారసుడికి అప్పజెప్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఇదే చేస్తున్నారేమో అనిపిస్తుంది.

తండ్రి గెలిచాక.. పక్కనే ఉంటూ దేశ రాష్ట్ర నాయకులకు కలుస్తూ ట్రెండింగ్‌గా మారిపోయారు అకీరా. తాజాగా నరేంద్ర మోదీని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీటిలో అకీరా లుక్ ట్రెండ్ అవ్వడమే కాదు.. త్వరలోనే ఎంట్రీ ఇస్తారని ఫిక్సైపోయారు అభిమానులు.

ఈ గుర్తింపు రేపు అకీరా మొదటి సినిమాకు హెల్ప్ అవుతుందనడంలో సందేహమేం లేదు. ఇప్పటికైతే క్లారిటీ లేదు కానీ కచ్చితంగా త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. అకీరా నందన్‌కు ఇప్పుడు 20 ఏళ్ళు.

నిన్న మొన్నటి వరకు చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఇప్పుడు మాత్రం హీరో మెటీరియల్‌లా మేకోవర్ అయ్యారు. ఒప్పుకున్న ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ పూర్తి చేసాక.. పవన్ పూర్తిగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేయడం ఖాయం. ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ స్టార్ భర్తీ చేయాలని చూస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న మాంటేజ్ షాట్స్ తీసుకుని అద్భుతంగా ఎడిట్ చేసారు అకీరా నందన్. మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా యాడ్ చేసారు. ఈ వీడియో వైరల్ అవుతుందిపప్పుడు.

తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే అంటూ రేణు దేశాయ్ పోస్ట్ చేసిన వెంటనే వీడియో వైరల్ అవ్వడం మొదలైంది. అకీరా తీరు, జోరు చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.




