- Telugu News Photo Gallery Cinema photos Akhanda 2 Movie Update: Boyapati srinu and Nandamuri Balakrishna movie with 150 crores budget Telugu Heroes Photos
Akhanda 2: 150 కోట్ల బడ్జెట్ తో బోయపాటి బాలయ్య సినిమా.? అఖండ 2 నా.? స్క్రిప్ట్ మారిందా.?
బాలయ్యపై ఒకప్పుడు 50 కోట్లు బడ్జెట్ పెట్టాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే వాళ్లు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు.. 50కి ముందు 1 పెట్టి.. 150 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు. ఈ గ్యాప్‌లోనే బాలయ్య మార్కెట్ అంతగా ఎలా పెరిగింది..? NBK 110 కోసం ఊహించని బడ్జెట్ పెట్టడానికి రీజన్ ఏంటి..? అఖండ 2 ఇదేనా లేదంటే దీని తర్వాత ఉండబోతుంది..? అఖండ తర్వాత బాలయ్య కెరీర్ రూపురేఖలు మారిపోయాయి.
Updated on: Jun 09, 2024 | 5:36 PM

అఖండ 2 అనుకున్న టైమ్‌కు మొదలవుతుందా..? లేదంటే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఆలస్యం కానుందా..? ఉన్నట్లుండి ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకుంటున్నారు కదా..?

అందుకే అనుకున్న దానికంటే కాస్త ఆలస్యంగా సెట్స్‌పైకి వచ్చేలా ఉంది బాలయ్య, బోయపాటి సినిమా. ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్‌తో 14 రీల్స్, బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం ఈయన కమిటైన బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు బాబీ.


బాబీ తర్వాత బోయపాటితో సినిమా చేయబోతున్నారు బాలయ్య. 14 రీల్స్‌లో రానున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 150 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకగా.. హిందూపూర్‌లో ఈ చిత్ర ఓపెనింగ్ జరగబోతుంది. ఎప్పట్నుంచో ప్రచారంలో ఉన్న అఖండ 2 ఇదే అని.. ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ భారీ బడ్జెట్ పెడుతున్నారని అర్థమవుతుంది.




