- Telugu News Photo Gallery Cinema photos Tamil Heroine Darsha Gupta Celebrates Her Birthday With Orphaned Childrens telugu movie news
Dharsha Gupta: అందమే కాదు.. ఈ హీరోయిన్ మనసు కూడా బంగారమే.. అనాధ పిల్లలకు అండగా నిలిచిన ముద్దుగుమ్మ..
సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు చాలా మంది తారలు. కానీ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరికి సినిమాలో సక్సెస్ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అందులో దర్శ గుప్తా ఒకరు. కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ఎక్కువగానే కష్టపడుతుంది ఈ బ్యూటీ.
Updated on: Jun 09, 2024 | 11:22 AM

సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటారు చాలా మంది తారలు. కానీ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. మరికొందరికి సినిమాలో సక్సెస్ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. అందులో దర్శ గుప్తా ఒకరు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఇమేజ్ సొంతం చేసుకోవడానికి ఎక్కువగానే కష్టపడుతుంది ఈ బ్యూటీ. తమిళంలో రుద్ర తాండవం, ఓ మై ఘోస్ట్ అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను పెంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన మంచి మనసును చాటుకుంది. ఇటీవల తన పుట్టినరోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది. ఎలాంటి హడావిడి చేయకుండా.. సైలెంట్గా అనాథ శరణాయాల్లో బర్త్ డే జరుపుకుంది.

అనాథ శరణాలయంలో పిల్లలకు అన్నదానం చేసింది. వారితో చాలా సేపు ముచ్చటించింది. పిల్లలతో కలిసి తను ఒక చిన్నారిగా మారి వారితో కలిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తల్లిలేని పిల్లలకు అందరూ తల్లులే.. ఇవాళ నా పుట్టిన రోజు దేవుడి బిడ్డలతో జరుపుకుంటున్నాను అని రాసుకొచ్చింది.

ఈ చిన్నారులను ఆదుకునేందుకు చేతులు కలపండి అంటూ శ్రీ అరుణోదయం ఓ అర్జీ ఛారిటీ ఆర్గనైజేషన్ గురించి చెప్పుకొచ్చింది. పుట్టినరోజున చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించింది. దర్శగుప్తా మంచి మనసుపై పొగడ్తలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

దర్శ గుప్తా ఇలా సేవ కార్యక్రమాలు చేయడం మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆమె సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల రోడ్డు పక్కన ఉన్న వృద్ధులకు ఫుడ్ ప్యాకెట్స్, మంచి నీళ్ల బాటిల్స్ అందించింది. ఇప్పుడు తన పుట్టినరోజు వేడుకలను అనాధ శరణాలయంలో జరుపుకుంది.




