AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌ కోసం కథ రెడీ చేసి ఎన్టీఆర్‌తో మూవీ.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన క్రేజ్ గురించి, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ మూవీతో సౌత్ లోనే కాకుండా.. నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రభాస్ మూవీస్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ప్రభాస్‌ కోసం కథ రెడీ చేసి ఎన్టీఆర్‌తో మూవీ.. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్
Prabhas, Ntr
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2025 | 7:01 PM

Share

టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కథ నచ్చక కొంతమంది ఆ సినిమాలను వదులుంటే మరోకొంతమంది అనుకోని కారణాల వల్ల సినిమాలను మిస్ చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే దర్శకులు కూడా ఓ హీరో కోసం రాసుకున్న కథతో మరో హీరోతో సినిమాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ స్టార్ డైరెక్టర్ ప్రభాస్ తో చేయాల్సిన సినిమాను ఎన్టీఆర్ తో చేశానని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. ఇద్దరికీ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుంటే.. ఆర్ఆర్ఆర్  దగ్గర నుంచి ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఓ దర్శకుడు మాట్లాడుతూ.. ప్రభాస్ కోసం రెడీ చేసిన కథతో ఎన్టీఆర్ తో సినిమా చేశాను అని తెలిపాడు.

10ప్లాప్స్ రెండే రెండు హిట్స్.. అందంలో దేవకన్య ఈ వయ్యారి భామ.

ఆయన ఎవరో కాదు టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యేడు సురేందర్ రెడ్డి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ టాలెంటడ్ డైరెక్టర్. సురేందర్ రెడ్డి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ చూశారు. అలాగే ఫ్లాప్స్ కూడా చూశారు. ఆయన చివరిగా డైరెక్ట్ చేసిన అఖిల్ ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

అబ్బో.. ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యాం భయ్యా..!! ఈ క్రేజీ భామ గుర్తుందా.?

కాగా ఓ ఇంటర్వ్యూలో సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. అతనొక్కడే సినిమా తర్వాత నాకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అప్పుడే ప్రభాస్ తో సినిమా చేద్దాం అని అంతా సిద్ధం చేసుకున్నా.. కథ కూడా రెడీ అయ్యింది. ఇంతలో ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఓ వ్యక్తి నాతో అన్నారు. ఆయన మాట కాదనలేక ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి ఎన్టీఆర్ తో చేశా.. పైగా ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో చేయకపోతే బాగుండదేమో అని వెళ్లి ఎన్టీఆర్ ను కలిసి కథ చెప్పా.. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఆ సినిమానే అశోక్. అయితే ప్రభాస్ కోసం రెడీ చేసుకున్న కథ ఇది. ఈ కథలో కొన్ని మార్పులు చేసి తారక్ తో చేశాను అని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

మహేష్ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లి ఏడ్చుకుంటూ వచ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .