- Telugu News Photo Gallery Cinema photos Tv serial actress raksha gowda latest glamour photos goes viral on internet
సీరియల్‌లో సింపుల్ లుక్స్.. బయట మాత్రం బీభత్సం భయ్యా..!
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకున్న ధారవాహిక ఇదే. ఇందులో రిషి, వసుధార పాత్రలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.. 2020లో ప్రారంభమైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి టాప్ స్థానంలో దూసుకుపోయింది.
Updated on: Dec 02, 2025 | 10:32 PM

బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకున్న ధారవాహిక ఇదే. ఇందులో రిషి, వసుధార పాత్రలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.

2020లో ప్రారంభమైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి టాప్ స్థానంలో దూసుకుపోయింది. మహేంద్ర, జగతి మేడమ్, దేవయాని పాత్రలకు కూడా అభిమానులు ఉన్నారంటే ఈ సీరియల్ కు వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.

రిషి పాత్రలో కన్నడ నటుడు ముఖేష్ గౌడ నటించగా.. వసుధార పాత్రలో రక్షా గౌడ నటించింది. వీరిద్దరి జోడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇందులో అందం, అమాయకత్వం, తెలివైన అమ్మాయిగా ఇలా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది వసూధార.

ఇటీవలే ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడిన సంగతి తెలిసిందే. వసుధార పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ.. ఆ సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించింది.

కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా డిఫరెంట్. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ షో నెట్టింట ఫాలోవర్లను కట్టిపడేస్తుంది. తాజాగా వసుధార క్రేజీ ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి.




