NTR 30: తారక్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. NTR 30 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్ ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR )సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్ ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొరటాల మెగాస్టార్ చిరంజీవితో ఆచార్యా సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు. అయితే తారక్ కోసం కొరటాల అదిరిపోయే కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహా కథను కొరటాల శివ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజాకార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. అయితే ఆచార్య సినిమా దెబ్బ కొట్టడంతో కథ విషయంలో మార్పులు జరిగాయని తెలుస్తోంది. అందుకోసం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని టాక్. అయితే ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం డేట్ ను కూడా లాక్ చేశారట. ఆగస్టు 30నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకోసం భారీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి