Nithiin Movies: వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో..’యాత్ర’ దర్శకుడితో నితిన్

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021లో నితిన్  ఫుల్ జోష్ లో ఉన్నాడనే చెప్పాలి.

Nithiin Movies: వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో..'యాత్ర' దర్శకుడితో నితిన్
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2021 | 8:48 AM

Nithiin Movies: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 2021లో నితిన్  ఫుల్ జోష్ లో ఉన్నాడనే చెప్పాలి. ఈ ఏడాది ప్రారంభంలో చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత ఇటీవల రంగ్ దే సినిమా రిలీజ్ చేసాడు నితిన్. ఈ సినిమా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు బాలీవుడ్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాను పట్టాలెక్కించాడు. ఆ తరువాత సినిమాగా ‘పవర్ పేట’ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. అయితే నితిన్ టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ తో సినిమా చేస్తున్నాడని టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటె ఇప్పుడు మరో దర్శకుడితో  నితిన్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

‘యాత్ర’ సినిమాతో దర్శకుడిగా మహి.వి రాఘవ్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ దర్శకుడు ఓ మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అంటున్నారు. ఇద్దరూ పోలీస్ ఆఫీసర్స్ .. వాళ్ల చుట్టూనే ఈ కథ తిరుగుతుందట. రాఘవ్ ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించినట్టుగా తెలుస్తోంది. రాఘవ్ చెప్పిన కథకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ‘పవర్ పేట’ తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

మరిన్ని ఇక్కడ చదవండి : 

61వ సినిమాకు కూడా ఆ దర్శకుడికే ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో.. మూడోసారి ‘వాలిమై’ డైరెక్టర్‏తోనే అజిత్..

HariTeja: పాప‌ను వీడియో కాల్‌లో చూసేదాన్ని.. పాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.. ఏమోష‌నల్ అయిన హ‌రితేజ‌.

వెనక్కు తగ్గిన ‘నారప్ప’ టీం.. ప్రస్తుత పరిస్థితులలో వాయిదా వేస్తున్నాం అంటూ ట్వీట్..

Aha OTT: మ‌రో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా.. వంద‌కుపైగా దేశాల్లో కోటికి చేరిన డౌన్‌లోడ్‌లు..