Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్‌కు మరో హిట్ లోడింగ్.. సినిమా వేరే లెవెల్ అంతే!

Karthikeya 2 Twitter Review: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూలు వచ్చేశాయి.. ఈ మూవీ ప్రీమియర్ షోలు యూఎస్‌లో పడగా.. ప్రతీ నెటిజన్.. పాజిటివ్ రివ్యూలతో..

Karthikeya 2: కార్తికేయ 2 ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్‌కు మరో హిట్ లోడింగ్.. సినిమా వేరే లెవెల్ అంతే!
Karthikeya 2
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 13, 2022 | 9:23 AM

‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలతో టాలీవుడ్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు. గతంలో వరుస పరాజయాలు బాధపెట్టినా.. ‘అర్జున్ సురవరం’తో హీరో నిఖిల్ బాక్స్ఆఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు తన హిట్ డైరెక్టర్ చందూ మొండేటి(Chandoo Mondeti)తో కలిసి ‘కార్తికేయ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఎనిమిదేళ్ల కిందట సూపర్ హిట్ అందుకున్న ‘కార్తికేయ’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది ‘కార్తికేయ 2’. ఇందులో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్(Anupam Kher) కీలక పాత్ర పోషించారు. తాజాగా యూఎస్‌లో ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోలు పడగా.. సినిమా హిట్ అంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అవేంటో ఓసారి చూసేద్దాం పదండి..

ఇవి కూడా చదవండి

ఫస్ట్ హాఫ్ బాగుందని.. సెకండ్ హాఫ్ అదిరిపోయిందని కొంతమంది పోస్టులు పెడుతుండగా.. ఇంకొందరు సెకండ్ హాఫ్ ప్రతీ సీన్‌లోనూ థ్రిల్ ఎలిమెంట్ ఉందని.. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అని ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.

ఎప్పటిలానే నిఖిల్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా, దర్శకుడు చందూ మొండేటి.. ప్రతీ ఫ్రేమ్‌ను అద్భుతంగా మలిచాడని.. ఎక్కడా కూడా మిస్ కాకుండా మంచి సినిమాను అందించాడని ఫ్యాన్స్ అంటున్నారు.

ఓవరాల్‌గా కార్తికేయ 2 సూపర్బ్ కంటెంట్‌తో కూడిన చక్కటి సీక్వెల్ ఫిల్మ్‌ అని అభిమానులు చెబుతున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్, ప్రతీ సీన్‌లోనూ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందని.. తప్పకుండా థియేటర్స్‌లో చూడాల్సిన బొమ్మ అని అంటున్నారు. ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారని.. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని అంటున్నారు. ముఖ్యంగా కాలభైరవ మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అని చెబుతున్న ఫ్యాన్స్.. లాస్ట్ 45 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. దీని బట్టి చూస్తే నిఖిల్ ఖాతాలోకి మరో హిట్ లోడింగ్ అని చెప్పాలి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం.. 

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!
ఇషా అంబానీ వద్ద రంగులు మార్చే కారు.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!