SPY Trailer: ‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు’.. ఉత్కంఠభరితంగా ‘స్పై’ ట్రైలర్.. రానా ఎంట్రీ అదుర్స్..
యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ గర్రి బిహెచ్ తెరకెక్కిస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్1, 2 చిత్రాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గర్రి బిచెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న హీరో నిఖిల్ సిద్ధార్థ్. కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు చేతి నిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ హీరో నటిస్తోన్న చిత్రం స్పై. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ గర్రి బిహెచ్ తెరకెక్కిస్తున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు, హిట్1, 2 చిత్రాలకు ఎడిటర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన గర్రి బిచెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు. ఇందులో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఈ నెల 29న విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
అమీర్ పేటలోని AAA సినిమాస్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేదికపై విడుదల చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. లవ్.. యాక్షన్.. ఎమోషన్స్.. ఛేజింగ్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా ఇందులో చివరలో రానా ఎంట్రీ అదిరిపోయింది. సుభాష్ చంద్రబోస్ మరణం వెనక ఉన్న రహస్యాలు చుట్టూ సాగనుంది.
చరిత్ర మనకెప్పుడు నిజం చెప్పదు.. దాస్తుంది అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చే డైలాగ్ నుంచి.. చివరలో స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చేది కాదు.. లాక్కునేది.. ఇది నేను చెప్పింది కాదు. నేతాజీ చెప్పింది అంటూ రానా చెప్పే వరకు డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.