Thalapathy Vijay: ‘లియో’ ఫస్ట్ లుక్‌లో ఇవి గమనించారా.? దర్శకుడి సైలెంట్ మెసేజ్ ఇదేనా.!
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటారు.

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత.. ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోల్లో దళపతి విజయ్ ముందు వరుసలో ఉంటారు. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఆయన సినిమా కోసం తెలుగు ఫ్యాన్స్ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ‘లియో’ మూవీ తెరకెక్కుతోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’ సినిమాలతో అదిరిపోయే ఫ్యాన్ బేస్ సంపాదించిన లోకేష్.. ఆ రెండు చిత్రాలను లింకప్ చేస్తూ ఎల్‌సీయూ(లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)ను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రాబోయే లియో సినిమా కూడా అందులో భాగమైనదని టాక్. అటు విజయ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేసింది.
ఈ ఫోటోలో విజయ్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో వెనుక మంచు కొండ, పక్కనే తోడేలు, గాల్లో రక్తం, ఊడిపోయిన పళ్లను మీరు చూడవచ్చు. విజయ్‌తో పాటు ఫోటోలో ఉన్న పన్ను, రక్తం సంతానం(విజయ్ సేతుపతి)దేనని ఫ్యాన్స్ అంటున్నారు. విక్రమ్ సినిమాలోని సంతానం క్యారెక్టర్‌ను ఓసారి గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే దీనిపై మరింతగా క్లారిటీ రావాలంటే ట్రైలర్ రావాల్సిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదలవుతోంది.
#LeoFirstLook pic.twitter.com/zephjhBVbu
— Vijay (@actorvijay) June 21, 2023