Tollywood: బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో అయ్యాడు.. ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు.. గుర్తుపట్టగలరా ?..
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు సౌత్ ఇండియా క్రేజీ హీరో. పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగుతోపాటు.. ఉత్తరాదిలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. కానీ నిజానికి అతను తమిళ్ స్టార్ హీరో. అతని కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టరా ?..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు సౌత్ ఇండియా క్రేజీ హీరో. పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగుతోపాటు.. ఉత్తరాదిలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. కానీ నిజానికి అతను తమిళ్ స్టార్ హీరో. అతని కోసం ప్రాణాలిచ్చే అభిమానులు ఉన్నారు. గుర్తుపట్టరా ?.. తనే దళపతి విజయ్. ఈరోజు ఈ హీరో పుట్టినరోజు. 1974 జూన్ 22న మద్రాసులో జన్మించారు విజయ్. ఆయన తండ్రి చంద్రశేఖర్ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. అలాగే తల్లి శోభ గాయని. కర్ణాటక సంగీత విధ్వంసులు.
1984 వెట్రి సినిమాతో బాలనటుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తన తండ్రి దర్శకత్వం వహించిన అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. బాలనటుడిగా దాదాపు ఆరు చిత్రాల్లో నటించారు విజయ్. 1992లో నాలయ గడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుని ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.




కేవలం తమిళంలోనే కాదు.. విజయ్ దళపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు ఈ హీరో నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇటీవలే వారసుడు సినిమాతో తెలుగులోకి అడుగుపట్టారు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.