Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 Pages Trailer: ‘ప్రేమించేందుకు రీజన్.. ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఆన్సర్ ఉండకూడదు’.. ఆకట్టుకుంటున్న 18 పేజిస్ ట్రైలర్..

సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు.. పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

18 Pages Trailer: 'ప్రేమించేందుకు రీజన్.. ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఆన్సర్ ఉండకూడదు'.. ఆకట్టుకుంటున్న 18 పేజిస్ ట్రైలర్..
18 Pages Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 17, 2022 | 8:54 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తోన్న సినిమా 18 పేజిస్. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ డైరెక్టర్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు.. పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ ను నిర్వహించారు. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

లవ్.. రొమాంటిక్.. యాక్షన్.. థ్రిల్లింగ్ అంశాలతోల ట్రైలర్ కొనసాగింది. కేవలం ఇద్దరి ప్రేమికులు మధ్య జరిగే ఫీలింగ్స్ మాత్రమే కాకుండా ఈ సినిమాలోని ఆసక్తికరమైన సంఘటనలను చూపించారు. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నామంటే ఆన్సర్ ఉండకూడదు వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈనెల 23న రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా.. హీరో నిఖిల్ మాట్లాడుతూ…నా కార్తికేయ సినిమాకి మంచి ప్రోమోషన్ చేశారు.అలానే ఈ సినిమాకి మీ సపోర్ట్ కావాలి. నాపై మంచి ప్రేమను చూపిస్తున్నారు థాంక్యూ.ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో సరయు మంచి పాత్రను చేసింది.ఇప్పటి వరకు మీరు చూసిన సరయు వేరు,ఈ సినిమాలో మీరు చూడబోయే సరయు వేరు.ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ప్రేమలో పడతారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్న అని మీకు 23న అర్థం అవుతుంది. అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.