AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhhi Agerwal: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌.. అసలు నిజం బయట పెట్టిన డ్రైవర్

భీమవరంలో జరిగిన ఈవెంట్‌కు నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో వచ్చిందంటూ వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. తాజాగా ఈ విషయంపై నిధి వివరణ ఇచ్చింది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిందామె.

Nidhhi Agerwal: ఏపీ ప్రభుత్వ వాహనంలో హీరోయిన్ నిధి అగర్వాల్‌.. అసలు నిజం బయట పెట్టిన డ్రైవర్
Nidhhi Agerwal
Basha Shek
|

Updated on: Aug 11, 2025 | 9:44 PM

Share

ఏపీ ప్రభుత్వ బోర్డు ఉన్న వాహనంలో కనిపించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ఆ వాహనాలను వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులెవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నిధి అగర్వాల్‌ ఎక్స్‌ వేదికగా వివరణ ఇచ్చారు.

‘ఇటీవల భీమవరంలో ఓ స్టోర్‌ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా జరిగిన పరిణామాలపై సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారమవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం రవాణా సదుపాయం కల్పించిన వాహనం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానిది. అయితే దానిని ఏర్పాటు చేసే విషయంలో నా పాత్ర లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నా కోసం ఎలాంటి వాహనం ప్రత్యేకంగా పంపలేదు. నా ప్రియమైన అభిమానులకు నిజాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న నా అభిమానులకు కృతజ్ఞతలు’ అని రాసుకొచ్చింది నిధి.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రకటన..

విజయవాడలో ట్రావెల్స్‌ వాహనాల దందా పెరిగిపోతోంది. ఏకంగా ప్రభుత్వ వాహనాల ప్లేట్స్‌తో రోడ్లపైకి వస్తున్నాయి. తాజాగా హీరోయిన్‌ నిధి అగర్వాల్ ఉదంతంతో ఈ ట్రావెల్స్‌ బాగోతాలు బయట పడ్డాయి. భీమవరంలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరైన నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో నోవాటెల్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. దీంతో ‘ ఇది అధికార దుర్వినియోగం’ అంటూ వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశంపై నిధి అగర్వాల్‌ను కారులో తీసుకెళ్లిన డ్రైవర్‌ క్లారిటీ ఇచ్చాడు. ప్రభుత్వ వాహనం ప్లేట్‌ పెట్టుకున్న మాట వాస్తవమేనని అంగీకరించాడు. తప్పు చేశానని అంగీకరిస్తూ వీడియో విడుదల చేశాడు. హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ను ఎయిర్‌పోర్ట్‌ నుంచి నోవాటెల్‌కు తీసుకెళ్లానన్నారు. కారు బ్రేక్‌ డౌన్‌ కావడంతో నిధి అగర్వాల్‌ కోసం వేరే కారు ఏర్పాటు చేశామన్నారు సెలబ్రెటీ కో-ఆర్డినేటర్‌ పవన్. ఆ కారు ప్రభుత్వం కోసం ఉపయోగిస్తారని తమకు కూడా తెలియదన్నారు. ఈ విషయంలో పొలిటికల్‌గా కానీ, సెలబ్రెటీలకు గానీ సంబంధం లేదన్నారు. ఈవెంట్‌కు ఏపీ ప్రభుత్వ వాహనంలో రావడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదన్నారు హీరోయిన్‌ నిధి అగర్వాల్‌. నిర్వాహకులు ఏర్పాటు చేసిన వాహనంలో మాత్రమే ప్రయాణించానన్నారు.

ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే అధికారులు, నాయకులకు మాత్రమే ప్రభుత్వ వాహనం వాడుకునే అవకాశం ఉంటుంది. అధికారులెవరూ తమ సొంత పనుల కోసం వాటిని వాడుకోవడానికి వీల్లేదు. కానీ, ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేని హీరోయిన్ ప్రభుత్వ అధికారిక వాహనంలో ఉన్న వీడియో బయటికి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్లేట్‌ పెట్టుకుంటే హైవేల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని.. తప్పు అని తెలిసినా ఉపయోగిస్తున్నారు కొందరు ట్రావెల్స్‌ నిర్వాహకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.