Mrunal Thakur: హీరో ధనుష్‌తో డేటింగ్ నిజమేనా? అసలు విషయం తేల్చేసిన మృణాళ్ ఠాకూర్
స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్-మృణాల్ ఠాకూర్ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఒకటి, రెండు వీడియోలు కూడా నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై మృణాళ్ ఠాకూర్ క్లారిటీ ఇచ్చింది.

సినిమా ఇండస్ట్రీలోని హీరో, హీరోయిన్లపై డేటింగ్ రూమర్లు రావడం కొత్తేమీ కాదు. అయితే ఇటీవల వచ్చిన ఒక రూమర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ల డేటింగ్ వ్యవహారం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ డేటింగ్ రూమర్లకు బలం చేకూరేలా వీరిద్దరు కలిసున్న ఒకటి, రెండు వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల జరిగిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్‌లో ధనుష్, మృణాళ్ ఠాకూర్ చాల చనువుగా కనిపించారు. అలాగే ధనుష్ అక్కలు ఇద్దర్ని ఇన్ స్టాలో మృణాల్ ఫాలో అవుతుండటం లాంటివి చూసి వీరి ప్రేమ వ్యవహారం నిజమేనని చాలా మంది భావించార
తాజాగా ఇదే విషయమై మృణాల్ ఠాకుర్ స్వయంగా స్పందించింది. ‘ హీరో ధనుష్ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మా ఇద్దరిపై వస్తోన్న రూమర్లు గురించి నాకు కూడా తెలుసు. నిజం చెప్పాలంటే అవి చాలా ఫన్నీగా అనిపించాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2′ సినిమా ఈవెంట్‌కి ధనుష్ రావడాన్ని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. ధనుష్-అజయ్ దేవగణ్ చాలా మంచి స్నేహితులు. అజయ్ పిలిస్తేనే ధనుష్.. ఆ కార్యక్రమానికి వచ్చాడు. మా ఇద్దరం కలిసి కనిపించినంత మాత్రాన మా మధ్య ఏదో జరుగుతున్నట్లు కాదు’ అని మృణాల్ క్లారిటీ ఇచ్చింది.
సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమాలో మృణాళ్ ఠాకూర్..
View this post on Instagram
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన మృణాళ్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న’ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. ఇక విజయ్ దేవరకొండతో చేసిన ‘ఫ్యామిలీ స్టార్’ యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తోన్న డెకాయిట్ లో కథానాయికగా నటిస్తోందీ అందాల తార. ఇప్పటికే చాలా భాగం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఆఖరి వారంలో డెకాయిట్ సినిమా రిలీజ్ కానుంది.
మృణాళ్ ఠాకూర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్,..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








