Nayanthara: ఆ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేసిన లేడీ సూపర్ స్టార్.. షారుఖ్ కోసం నయన్ కీలక నిర్ణయం..
కన్మనీ రాంబో ఖతిజా సినిమా టైమ్ నుంచే యాక్టివ్ అయ్యారు నయనతార. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా... రిలీజ్ తరువాత థియేటర్లను విజిట్ చేసి సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేశారు. చాలా కాలం తరువాత నయన్ ఇలా ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పబ్లిక్‌లోకి రావటంతో అభిమానులతో పాటుఇండస్ట్రీ జనాల్లోనూ కొత్త జోష్ కనిపించింది.
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార రూట్ మార్చబోతున్నారు. ఇన్నాళ్లు సినిమాల విషయంలో కండిషన్స్ అప్లై అంటూ చెబుతూ వచ్చిన ఈ బ్యూటీ… ఆ కండిషన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇదే ఇప్పుడు తమిళ సర్కిల్స్‌లో హాట్ హాట్ డిస్కషన్.. ఇంతకీ నయన్ పెట్టిన ఆ కండిషన్స్ ఏంటి..? ఇప్పుడు ఎందుకు మనసు మార్చుకుంటున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరం. దాదాపు దశాబ్ద కాలంగా ఇదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు నయన్. కెరీర్ స్టార్టింగ్‌లో సినిమా ఫంక్షన్స్, ప్రెస్‌మీట్స్‌లో సందడి చేసినా… తరువాత పర్సనల్ లైఫ్‌లో వచ్చిన కొన్ని ఇబ్బందుల కారణంగా మీడియా ముందుకు రావటం మానేశారు నయన్. తాను ప్రమోషన్‌కు రాని సినిమాలు సూపర్ హిట్ కావటంతో… అదే సెంటిమెంట్‌ను కంటిన్యూ చేస్తున్నారు.
కానీ రీసెంట్ టైమ్స్‌లో ఈ సెంటిమెంట్‌ను పక్కన పెట్టేశారు. తన సొంత బ్యానర్‌లో సినిమాలు చేస్తుండటంతో ఆ మూవీస్ ప్రమోషన్ బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అదే ట్రెండ్‌ను తను నటించిన సినిమాల విషయంలో కూడా కంటిన్యూ చేస్తారన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. జవాన్ విషయంలో అదే నిజం కాబోతుందన్నది బీటౌన్ అప్‌డేట్.
విఘ్నేష్ శివన్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
కన్మనీ రాంబో ఖతిజా సినిమా టైమ్ నుంచే యాక్టివ్ అయ్యారు నయనతార. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా… రిలీజ్ తరువాత థియేటర్లను విజిట్ చేసి సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నం చేశారు. చాలా కాలం తరువాత నయన్ ఇలా ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పబ్లిక్‌లోకి రావటంతో అభిమానులతో పాటుఇండస్ట్రీ జనాల్లోనూ కొత్త జోష్ కనిపించింది.
విఘ్నేష్ శివన్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇప్పుడు జవాన్ సినిమాకు పూర్తి స్థాయిలో ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు నయన్. మామూలుగానే షారూఖ్ సినిమాలో అంటే ఒకటి రెండు ప్రెస్‌మీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ఈవెంట్స్‌కు నయన్ కూడా అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా సౌత్ ప్రమోషన్స్‌లో నయన్ కీ రోల్ ప్లే చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే నయన్ వస్తారా…? లెట్స్ వెయిట్ అండ్ సీ.
షారుఖ్ ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి