Devara Movie: మరోసారి డ్యూయల్ రోల్ చేయనున్న తారక్.. దేవర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. జనతా గ్యారేజ్‌ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న మూవీ దేవర. ట్రిపులార్‌ సక్సెస్‌ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్‌ గ్లోబల్ రేంజ్‌కు చేరటంతో నెక్ట్స్ మూవీని కూడా అదే రేంజ్‌లో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీని అని కన్ఫార్మ్ చేసిన మేకర్స్‌, మేకింగ్‌, కాస్టింగ్ విషయంలో అదే రేంజ్‌ మెయిన్ టైన్ చేస్తున్నారు.

Devara Movie: మరోసారి డ్యూయల్ రోల్ చేయనున్న తారక్.. దేవర పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Devara
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Aug 18, 2023 | 10:50 PM

లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తా అంటున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ట్రిపులార్ రిలీజ్‌ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న తారక్‌ రీసెంట్‌గా దేవర సినిమాను స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. జనతా గ్యారేజ్‌ లాంటి బిగ్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న మూవీ దేవర. ట్రిపులార్‌ సక్సెస్‌ తరువాత ఎన్టీఆర్ ఇమేజ్‌ గ్లోబల్ రేంజ్‌కు చేరటంతో నెక్ట్స్ మూవీని కూడా అదే రేంజ్‌లో భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా మూవీని అని కన్ఫార్మ్ చేసిన మేకర్స్‌, మేకింగ్‌, కాస్టింగ్ విషయంలో అదే రేంజ్‌ మెయిన్ టైన్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నారన్నది నయా అప్‌డేట్‌. అంతేకాదు తారక్ తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నారని, ఒక పాత్రలో 60 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

గతంలో ఆంధ్రావాలా, జై లవ కుశ సినిమాల్లో డబుల్‌, త్రిపుల్‌ రోల్స్ చేశారు తారక్‌. లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తారక్ డ్యూయల్‌ రోల్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ మాత్రం అఫీషియల్ క్లారిటీ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

సీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌ విలన్‌ రోల్‌ ప్లే చేస్తున్నారు. ఇలా పాన్ ఇండియా స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న దేవర ఎన్టీఆర్ కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్‌.

ఎన్టీఆర్ ఇన్ స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.