Nayanthara: నెట్టింట లేడీ సూపర్ స్టార్ రచ్చ.. మాల్దీవ్స్ పిక్ షేర్ చేసిన నయన్.. ఆ టాటూ అర్థమేంటో..

తన కవల పిల్లలలు ఉయిర్, ఉలాగ్ లతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఆమె నటిస్తోన్న జవాన్ సినిమా ట్రైలర్ పంచుకుంది. ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న నయన్.. తరచూ అభిమానులకు ప్రత్యేక ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. ఇక ఇన్ స్టా స్టోరీస్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఆమె మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ షేర్ చేసుకుంది.

Nayanthara: నెట్టింట లేడీ సూపర్ స్టార్ రచ్చ.. మాల్దీవ్స్ పిక్ షేర్ చేసిన నయన్.. ఆ టాటూ అర్థమేంటో..
Nayanthara
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 03, 2023 | 7:38 AM

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలోకి అడుగుపెడుతుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ సరసన జవాన్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మరోవైపు ఇన్నాళ్లుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన్.. ఇటీవలే ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన కవల పిల్లలలు ఉయిర్, ఉలాగ్ లతో కలిసి ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ తర్వాత ప్రస్తుతం ఆమె నటిస్తోన్న జవాన్ సినిమా ట్రైలర్ పంచుకుంది. ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన క్షణాల్లోనే మిలియన్ ఫాలోవర్స్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న నయన్.. తరచూ అభిమానులకు ప్రత్యేక ఫోటోస్, వీడియోస్ పంచుకుంటుంది. ఇక ఇన్ స్టా స్టోరీస్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఆమె మాల్దీవ్స్ వెకేషన్ పిక్స్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి
Nayanthara

Nayanthara

ఆమె తన ఇన్ స్టా స్టోరీలో మాల్దీవ్స్ వెకేషన్ పిక్ పంచుకుంది. అందులో నయన్ మెడపై ఉన్న పచ్చబొట్టు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. చాలా కాలం తర్వాత నయన్ గ్లామర్ పిక్స్ నెట్టింట వైరవులతున్నారు. నయన్ మెడపై ఉన్న టాటూ.. మూడు చిహ్నాలను మిళితం చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది. నయనతారకు పచ్చబొట్టు అంటే చాలా ఇష్టం. ఆమె శరీరంలో పలు చోట్ల పచ్చబొట్టులు ఉన్నాయి.

నయన్ ఫిల్మ్ కెరీర్ ఎలా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా కాలం పాటు తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయన్. 2022 జూన్ లో చెన్నైలోని మహాబలిపురంలో ఇరువురు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి అక్టోబర్ లో సరోగసి పద్దతి ద్వారా ఇద్దరు కవల పిల్లలు ఉయిర్, ఉలాగ్ లు జన్మించారు. ప్రస్తుతం నయన్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.