Rajinikanth: ఆ విషయంలో ప్రభాస్‌ను బీట్ చేసిన సూపర్ స్టార్ రజినీకాంత్
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ మూవీ ఇప్పటికీ 700 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతుంది

సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా రోజుల తర్వాత సాలిడ్ హిట్ కొట్టారు. జైలర్ సినిమాతో తన సత్తా ఏంటో మరోమారు నిరూపించారు సూపర్ స్టార్. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీవిజయాన్ని అందుకుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు కలెక్షన్స్ కూడా దుమ్మురేపుతున్నాయి. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. అదేవిధంగా సునీల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఇక ఈ మూవీ ఇప్పటికీ 700 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతుంది. తెలుగులోనే ఇప్పటివరకు 75 కోట్ల గ్రాస్ రాబట్టింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు జైలర్ సినిమా కోసం రజినీకాంత్ అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర చర్చచే జరుగుతోంది. కోలీవుడ్ నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారరం సూపర్ స్టార్ జైలర్ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. జైలర్ కోసం సూపర్ స్టార్ 110 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు భారీ కలెక్షన్స్ రాబట్టడంతో నిర్మాతకు లాభాలు భారీగా వచ్చాయి.
View this post on Instagram
ఈ క్రమంలో రీసెంట్ గా సూపర్ స్టార్ ను కలిసి ఈ మూవీ నిర్మాత ఆయనకు అందనంగా 100 కోట్లు ఇచ్చారని టాక్. చెక్ రూపంలో జైలర్ నిర్మాతలు రజినీకాంత్ కు అదనంగా రెమ్యునరేషన్ ఇచ్చారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దాంతో ఇప్పుడు ఆయన అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు. జైలర్ సినిమాకు మొత్తంగా రజినీకాంత్ రూ. 210 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకొక్క సినిమాకు 150 కోట్లవరకు రెమ్యునరేషన్ తీసుకుంటుండగా ఇప్పుడు ఆ రికార్డ్ ను సూపర్ స్టార్ బీట్ చేశారు.
జైలర్ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..