Nayanthara: చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార.. ఎందుకోసమంటే?

నయనతార తన డాక్యుమెంటరీలో 'నానుమ్ రౌడీ దాన్' 'సినిమా విజువల్స్ ఉపయోగించడంపై వివాదం కొనసాగుతోంది. అయితే ఇది జరుగుతుండగానే షారుఖ్ ఖాన్, చిరంజీవి, రామ్ చరణ్ తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలుపుతూ మరొక లేఖను విడుదల చేసింది నయన తార.

Nayanthara: చిరంజీవి, రామ్ చరణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నయనతార.. ఎందుకోసమంటే?
Ram Charan, Cheranjeevi, Nayanthara
Follow us
Basha Shek

|

Updated on: Nov 21, 2024 | 3:20 PM

ప్రముఖ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాలోని సీన్స్ ను అనుమతి లేకుండా ఉపయోగించారని లేడీ సూపర్ స్టార్ పై కేసు నమోదైంది. ఈ విషయంపై నిర్మాత, స్టార్ హీరో ధనుష్ ను తప్పుపడుతూ నయనతార బహిరంగ లేఖ రాసింది. ఈ వివాదం కొనసాగుతుండగానే తన డాక్యుమెంటరీలో తనకు సహాయం చేసినందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది నయనతార. ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా షూటింగ్ సెట్ క్లిప్ ఇవ్వాలని ధనుష్‌ని నయనతార అడిగింది. అయితే ధనుష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అదే సమయంలో మిగతా నిర్మాతలు తను అడిగిన వెంటనే ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని నయనతార తెలిపింది. ఇందుకు గానూ పలువురు సినీ ప్రముఖులకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

నేను పని చేసిన ప్రతి సినిమాకు నా జీవితంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే సినిమాల్లో నాకెంతో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా సినిమాలు నా మనసుకు దగ్గరయ్యాయి. అందుకే ఆ సినిమాల్లోని జ్ఞాపకాలను, సన్నివేశాలను మా డాక్యుమెంటరీలో చేర్చాలనుకున్నాను. అందుకోసం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందడానికి నేను చాలా మంది నిర్మాతలను సంప్రదించాను. వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అనుమతి ఇచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరంతా నాకు అత్యంత విలువైన క్షణాలను అందించారు. వీరందరిపై నాకెంతో గౌరవం ఉంది. నా ప్రయాణం ఇలానే కొనసాగుతుంది’ అని నయన తార రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

నయన తార పోస్ట్ ఇదిగో..

నయనతార ధన్యవాదాలు తెలిపిన వారిలో షారుఖ్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితర ప్రముఖులు ఉన్నారు. వీరితో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ కు చెందిన కామాక్షి మూవీస్ అధినేత డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డి, యలమంచిలి సాయిబాబా ( శ్రీ సాయి బాబా మూవీస్)లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది నయన తార.

నెట్ ఫ్లిక్స్ లో నయన్ డాక్యుమెంటరీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.