Nayanthara : షారుఖ్ ఖాన్ సినిమా కోసం భారీగా డిమాండ్ చేస్తున్న బ్యూటీ.. నయన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రస్తుతం సౌత్ లో లీడింగ్ లోనో హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు నయనతార. లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది.
ప్రస్తుతం సౌత్ లో లీడింగ్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు నయనతార(Nayanthara). లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ తో దూసుకుపోతోంది ఈ బ్యూటీ. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో వైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తెలుగు తమిళ్ సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేస్తోంది ఈ చిన్నది. ఇటీవలే ఈ చిన్నది పెళ్లిపీటలెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు విగ్నేష్ శివన్ తో ఏడడుగులు వేసింది నయన్. ఇటీవలే ఈ అమ్మడు హనీమూన్ నుంచి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలతో బిజీ అయ్యింది. ప్రస్తుతం నయనతార బాలీవుడ్ డెబ్యూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. బాద్షా షారుఖ్ ఖాన్ తో కలిసి సినిమా చేస్తోంది నయన్. స్టార్ దర్శకుడు అట్లీ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు జవాన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవలే నయనతార షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం నయనతార భారీగా డిమాండ్ చేస్తుందని తెలుస్తోంది. మామూలుగానే నయన్ రెమ్యునరేషన్ మిగిలిన హీరోయిన్స్ అందరికంటే ఎక్కువ.. సినిమాకు నాలుగు కోట్ల వరకు అందుకునే నయన్. జవాన్ సినిమా కోసం 8 కోట్లు తీసుకుంటుందని తెలుస్తుంది. ఇక భారీ స్థాయిలో హిందీ తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లోనూ జవాన్ రిలీజ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి