Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లోకి  న్యాచురల్ స్టార్.. సందడి చేయనున్న నాని..

ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 3లోకి చాలా మంది గెస్టులు వచ్చారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, డైరెక్టర్ హరీష్ శంకర్ వంటి ప్రముఖులు ఈ షో వేదికపై సందడి చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ 3కి న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా.

Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3లోకి  న్యాచురల్ స్టార్.. సందడి చేయనున్న నాని..
Nani
Follow us

|

Updated on: Aug 09, 2024 | 6:18 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రతిభావంతులైన గాయనిగాయకులను సినీ సంగీత ప్రపంచానికి పరిచయం చేస్తోన్న ఈ షోకు రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతుంది. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 3లోకి చాలా మంది గెస్టులు వచ్చారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, డైరెక్టర్ హరీష్ శంకర్ వంటి ప్రముఖులు ఈ షో వేదికపై సందడి చేశారు. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ 3కి న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చారు. ఈ షో 18, 19వ ఎపిసోడ్ లలో నాని సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసింది ఆహా.

ఇదిలా ఉంటే.. తెలుగు ఇండియన్ ఐడల్ షో వేదికపై నాని సందడి చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో సీజన్ 2లోనూ నాని తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద సందడి చేశారు. గతంలో ఆయన నటించిన దసరా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సింగింగ్ రియాల్టీ షోలో పాల్గొన్నాడు. అప్పట్లో నాని వచ్చిన ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి ఇండియన్ ఐడల్ రియాల్టీ షోలో సందడి చేయనున్నాడు.

ఇదిలా ఉంటే.. హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు. చాలా నెలలుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుంది. ఇఫ్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మరింత క్యూరియాసిటిని కలిగించాయి. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో పాల్గొన్నాడు నాని. మొదటి తొమ్మిది మంది పోటీదారులతోపాటు జడ్జీలు ఎస్ ఎస్ తమన్, గీతా మాధురి, సింగర్ కార్తీక్ లతో నాని సందడి చేయనున్నారు. నాని అతిథిగా వచ్చిన ఈ రెండు ఎపిసోడ్స్ శుక్రవారం, శనివారాల్లో రాత్రి 7 గంటల నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
భాగ్యనగారానికి అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ..!
భాగ్యనగారానికి అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ..!
కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్యతరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం
వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్యతరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం
శాస్త్రీయ విధానంలో సినిమా చెట్టును నిలబెట్టేందుకు ప్రయత్నం
శాస్త్రీయ విధానంలో సినిమా చెట్టును నిలబెట్టేందుకు ప్రయత్నం
చైతూతో శోభిత నిశ్చితార్థం.. సంతోషంగా ఉన్నాం.. నాగార్జున..
చైతూతో శోభిత నిశ్చితార్థం.. సంతోషంగా ఉన్నాం.. నాగార్జున..
స్మార్ట్ వాచ్‌లు రక్తపోటును ఎలా కొలుస్తాయి.? టెక్నాలజీ ఏంటంటే..
స్మార్ట్ వాచ్‌లు రక్తపోటును ఎలా కొలుస్తాయి.? టెక్నాలజీ ఏంటంటే..
అక్కడ తేలు కుడితే అదృష్టం.. ఇదెక్కడి వింత..!
అక్కడ తేలు కుడితే అదృష్టం.. ఇదెక్కడి వింత..!
జియో, ఎయిర్‌టెల్‌లకు చుక్కలే.. BSNLరూ.107తో 35 రోజుల వ్యాలిడిటీ
జియో, ఎయిర్‌టెల్‌లకు చుక్కలే.. BSNLరూ.107తో 35 రోజుల వ్యాలిడిటీ