Cinima Chettu: 300 సినిమాల్లో కనిపించిన మహా వృక్షం నేలకూలింది.! చెట్టును తిరిగి పునరుజ్జీవం..
గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. అంటూ అప్పట్లో అక్కినేని సినిమా మూగమనసులో ఓ పాట ఉంటుంది. మరి ఆ పాటను చూసి ఈ చెట్టును పెట్టారో.. లేదా ఈ నిద్రగన్నేరు చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు కానీ.. సినిమా చెట్టుగా ఫేమస్ అయిన ఓ మహా వృక్షం కూలిపోయింది. సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం.
గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది.. అంటూ అప్పట్లో అక్కినేని సినిమా మూగమనసులో ఓ పాట ఉంటుంది. మరి ఆ పాటను చూసి ఈ చెట్టును పెట్టారో.. లేదా ఈ నిద్రగన్నేరు చెట్టును స్ఫూర్తిగా తీసుకుని రచయిత ఆ పాట రాశారో తెలియదు కానీ.. సినిమా చెట్టుగా ఫేమస్ అయిన ఓ మహా వృక్షం కూలిపోయింది.
సినిమా వాళ్లకు ఆ చెట్టు ఒక సెంటిమెంట్. అక్కడ సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని నమ్మకం. ఒకటా రెండా, వందల సినిమాల షూటింగులు, ఆ చెట్టు కిందే జరిగాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ చెట్టు.. సోమవారం తెల్లవారుజామున కూలిపోయింది. ఇది రియల్ వృక్షం మాత్రమే కాదు. రీల్ వృక్షంగా చాలా సినిమాల్లో కనిపించింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి నిన్నమొన్నటి రంగస్థలం మూవీ వరకు ఆ చెట్టు ఓ సినీ ఐకానిక్ మూవీ. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని చెబుతారు. దర్శకుడు వంశీ అయితే తన స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారట. శంకరాభరణం, సీతారామయ్య గారి మనవరాలు, త్రిశూలం, పద్మవ్యూహం, మూగ మనసులు లాంటి ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు దగ్గర తీసిన సీన్లు ఉంటాయి. 150 సంవత్సరాల వయస్సున్న ఈ చెట్టు దగ్గర దాదాపు 300 సినిమాల షూటింగ్‌లు జరగడం విశేషం.
ఒక ఊరికి పేరు వచ్చిందంటే దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది. ఆ ఊరి నుంచి ఎవరో ఒకరు చాలా ఎత్తుకు ఎదగాలి. లేదా ఏదైనా ఘనకార్యం చేసి ఉండాలి. కానీ కుమారదేవం గ్రామానికి అంతటి ఘనత ఈ సినిమా చెట్టు తెచ్చిపెట్టింది. ఈ చెట్టు తమ ఊరికి ఎంతో పేరు తెచ్చిందని, అది కూలిపోవడం బాధ కలిగిస్తోందంటున్నారు కుమారదేవం గ్రామస్తులు. కాగా నేల కూలిన ఆ మహావృక్షాన్ని డీఎఫ్‌ఓబి నాగరాజు పరిశీలించారు. శాస్త్రీయ పద్ధతిలో చెట్టును తిరిగి బ్రతికించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. చెట్టును తిరిగి బతికించడం కోసం తమవంతు సహకారం అందిస్తామని, ఎలాగైనా చెట్టును బతికించాలని ప్రవాసాంధ్రులు కోరుతున్నారు. చెట్టు పరిస్థితిని జియాలజిస్టులకు నివేదించి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.