Pied Crow: ఈ కాకులు మాట్లాడతాయి.. పాటలు కూడా పాడతాయి.! చూశారా.?
సాధారణంగా అన్ని ప్రాంతాల్లోనూ కాకులు కనిపిస్తాయి. వీటిని ఎవరూ స్పెషల్గా పెంచరు. అయినా పెంపుడు ప్రాణుల్లాగా కావ్ కావ్ అంటూ అరుస్తూ.. మన చుట్టూ ఉన్న పరిసరాల్లోనే మెదులుతుంటాయి. కానీ ఓ కాకి.. రంగులో మన చుట్టూ పక్కల తిరిగే కాకుల కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అలాగే వాటి కంటే పెద్ద సైజ్‌లో ఉంటుంది. వీటన్నింటి కంటే ముఖ్యంగా ఈ కాకి మాట్లాడగలదు.. పాటలు పాడగలదని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు.

ఆ కాకి పేరు.. పైడ్ క్రో. ఇది చూడడానికి మామూలు కాకుల మాదిరిగానే నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ, మొత్తం బ్లాక్ కలర్లో ఉండదు. మెడ కింద, పై భాగం తెలుపు రంగులో ఉంటుంది. ఈ పైడ్ క్రో ఆఫ్రికా దేశాలలో ఎక్కువగా కనిపిస్తోంది. పైడ్ క్రో కూడా మామూలు కాకుల మాదిరిగానే అన్ని ఆహారాలనూ తింటుంది. ఇవి చిన్న గుంపులుగా తిరుగుతుంటాయి. అయితే ఈ కాకి మన దగ్గర ఉండే కాకుల కంటే పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటుంది. పైడ్ క్రో ముక్కు, కాళ్లు కూడా పెద్దగానే ఉంటాయి.
ఈ కాకి గురించి మీరు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యం విషయమేమిటంటే.. దీనికి కాస్త శిక్షణ ఇస్తే మాట్లాడగలదు! పాటలు కూడా పాడగలదు! అదేంటి.. కాకి, పాట పాడటమేంటి అనుకుంటున్నారా? కానీ, నిజం. శిక్షణనిస్తే పైడ్ క్రో పాటలు పాడగలదట. అంటే.. బాధగా ఉన్నప్పుడు ఒకలా, సంతోషంగా ఉన్నప్పుడు మరోలా శబ్దాలు చేస్తుందట. అప్పుడు తాను ఎలా ఉన్నానన్న విషయం దాని తోటి పక్షులకు తెలిసిపోతుందన్నమాట. ఈ కాకి 6 సంవత్సరాలు బతుకుతుంది. అదే రక్షణ కల్పిస్తే.. 20 ఏళ్ల వరకు జీవిస్తుందని బర్డ్ సైంటిస్టులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.