Periods Twice A Month: నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?

ప్రతి అమ్మాయి తప్పక భరించవల్సిన బాధ పీరియడ్స్. సాధారణంగా 13 లేదా 14 యేళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 24 నుంచి 38 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా అకస్మాత్తుగా నెలకు రెండుసార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో? తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి?

Periods Twice A Month: నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?

|

Updated on: Aug 09, 2024 | 6:26 PM

ప్రతి అమ్మాయి తప్పక భరించవల్సిన బాధ పీరియడ్స్. సాధారణంగా 13 లేదా 14 యేళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతి 24 నుంచి 38 రోజులకు ఒకసారి పీరియడ్స్ వస్తుంటాయి. అయితే ఒక్కోసారి నెలలో రెండు పీరియడ్స్ వస్తుంటాయి. ఇలా అకస్మాత్తుగా నెలకు రెండుసార్లు రుతుక్రమం ఎందుకు వస్తుందో? తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమస్య తరచుగా సంభవిస్తే ఏం చేయాలి? నెలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పీరియడ్స్ రావడాన్ని సక్రమంగా లేని రుతుక్రమం అంటారు. కానీ ఈ రకమైన సమస్య చాలా అరుదు. అయితే నేటి కాలంలో చాలా మంది అమ్మాయిలు పీసీఓడీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా, నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంటాయి. అరుదుగా వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదుకానీ.. ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. ఇలా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం వల్ల ఒవేరియన్ ట్యూమర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

చాలా సార్లు, శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ సమతుల్యత కోల్పోతుంది. ఒత్తిడి పెరిగినా, ఆహారంలో మార్పు వచ్చినా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. పీసీఓడీ, థైరాయిడ్, ఫ్రైబోయిడ్ సమస్యల కారణంగా కూడా నెలకు రెండుసార్లు పీరియడ్స్ వస్తుంది. మీరూ ఈ రకమైన సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాల ద్వారా ఉపశమనం పొందొచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ సమస్యకు అల్లం చక్కగా పనిచేస్తుంది. అల్లం తినడం వల్ల రుతుచక్రం సాధారణం అవుతుంది. అలాగే పీరియడ్స్ క్రాంప్స్, అధిక రక్తస్రావం, వికారం, అపానవాయువు సమస్యల నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది. పీరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు PCODతో బాధపడుతున్నట్లయితే మీ ఆహారంలో దాల్చిన చెక్కను ఖచ్చితంగా చేర్చుకోవాలి. ఈ మసాలా దినుసు శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దాల్చిన చెక్క క్రమంతప్పకుండా తినడం వల్ల పీరియడ్స్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ షుగర్ లెవల్స్, హార్మోన్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగినా ఫలితం ఉంటుంది. చాలా మంది బరువు తగ్గేందుకు జీలకర్ర నీరు తాగుతుంటారు. పీరియడ్స్ సమస్యల నివారణకు కూడా జీలకర్ర నీటిని తాగవచ్చు. ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగడం వల్ల రుతుక్రమం ఆరోగ్యం మెరుగుపడుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధంగా పనిచేస్తుంది. ఇది పీరియడ్స్ సమయంలో శారీరక అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. అందుకే మీ రోజువారీ ఆహారంలో పసుపును తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు మీ వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నెలకు రెండుసార్లు పిరియడ్స్.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా.?
నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..
నానబెట్టిన బియ్యాన్ని వండటం వల్ల మంచి నిద్ర వస్తుందట..
ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్
ప్రపంచ రికార్డ్ సృష్టించే ఛాన్స్.. ఆ ఇద్దరిపై కన్నేసిన రోహత్
పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం
పెరిగిన కేపీఐ గ్రీన్ ఎనర్జీ షేర్లు..రెడింతలు పెరిగిన నికర లాభం
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..
తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్ పై సందడి చేయనున్న నాని..
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
వెంటపడ్డ ఆకతాయిలు.. గూడ్స్‌ రైలెక్కి 140కి.మీ.ప్రయాణించిన అమ్మాయి
భాగ్యనగారానికి అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ..!
భాగ్యనగారానికి అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ..!
కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
కివీ జ్యూస్ తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు
వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్యతరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం
వారెన్ బఫెట్ సంపద సూత్రం.. మధ్యతరగతి వారిని ధనవంతులను చేసే రహస్యం
శాస్త్రీయ విధానంలో సినిమా చెట్టును నిలబెట్టేందుకు ప్రయత్నం
శాస్త్రీయ విధానంలో సినిమా చెట్టును నిలబెట్టేందుకు ప్రయత్నం