AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hi Nanna: ‘హాయ్ నాన్న’ చూసి ఎమోషనల్ అయిన అమ్మాయి.. ఆ తండ్రీకూతుళ్ల ప్రేమకు నాని ఫిదా..

తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 7న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇందులో తండ్రీకూతురి ప్రేమకు నిజజీవితంలో అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.

Hi Nanna: 'హాయ్ నాన్న' చూసి ఎమోషనల్ అయిన అమ్మాయి.. ఆ తండ్రీకూతుళ్ల ప్రేమకు నాని ఫిదా..
Nani
Rajitha Chanti
|

Updated on: Dec 10, 2023 | 10:02 PM

Share

దసరా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని నటించిన సినిమా హాయ్ నాన్న. డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కించిన ఈమూవీలో మరోసారి తండ్రి పాత్రలో కనిపించాడు నాని. ఇందులో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది. అలాగే నాని కూతురిగా కియారా ఖన్నా కనిపించింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ డిసెంబర్ 7న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా అదరగొట్టేస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపు ఒక మిలియన్ డాలర్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇందులో తండ్రీకూతురి ప్రేమకు నిజజీవితంలో అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని ఓ తండ్రీకూతుళ్ల ప్రేమకు నాని ఫిదా అయ్యాడు.

ఆస్ట్రేలియాలో హాయ్ నాన్న సినిమా చూసిన అనంతరం ఒక బాలిక తన తండ్రిని గట్టిగా హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తన కూతురిని ఓదారుస్తూ ఆ తండ్రి కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్షణాలను కెమెరాలో బంధించిన ఓ నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ నానిని ట్యాగ్ చేశారు. ‘నాని గారు, మూవీ చాలా బాగుంది. చూసిన వాళ్లందరినీ కదిలించింది. ఎంతో మంది తండ్రీ కూతుళ్ళ మధ్య బంధాన్ని బలోపేతం చేసింది. ఇలాంటి మంచి సినిమాను ఎంచుకున్నందుకు చాలా థాంక్స్. ‘ అంటూ రాసుకొచ్చాడు.

‘సిడ్నీ థియేటర్లో సినిమా చూసి బయటికి రాగానే తన నాన్న ప్రేమ గుర్తొచ్చి(గుర్తించి) గట్టిగా హత్తుకున్న మా శ్రేష్ఠ, వాళ్ళ నాన్న శివ (మా అన్న/అన్న కూతురు) చుట్టూ ఉన్న అందరినీ అందరినీ కంట తడి పెట్టేలా చేశారు. ఇలాంటి మధుర జ్ఞాపకాన్ని ఇచ్చినందుకు శౌర్యువ్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇక అతని పోస్ట్ చూసిన నాని.. ఆ తండ్రీ కూతుళ్ల ప్రేమకు ఫిదా అయ్యాడు. ‘ఇది కథా ఆస్తి’ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.