ఆషికా రంగనాథ్.. కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్. కానీ ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగులో వరుస సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా.. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది ఆషికా. ఈ మూవీలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ లో సైలెంట్ అయ్యింది.