Daaku Maharaj: డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. అభిమానులకు ఫోన్ చేసిన బాలకృష్ణ..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో దూసుకుపోతుంది డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలైన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూ్స్ వస్తున్నాయి. బాలయ్య యాక్టింగ్.. డైరెక్టర్ బాబీ ఎలివేషన్స్.. తమన్ అందించిన ఆర్ఆర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Daaku Maharaj: డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. అభిమానులకు ఫోన్ చేసిన బాలకృష్ణ..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 12, 2025 | 5:17 PM

డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన సినిమా డాకు మహారాజ్. ఎప్పటిలాగే సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమాకు తెల్లవారుజామున నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. బాలయ్య నటవిశ్వరూపం.. ఆయన యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్, ఎలివేషన్లు చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య లెవల్ మూవీని డైరెక్టర్ బాబీ ఎంతో చక్కగా తీశారని.. ఈ సినిమాకు మన్ అందించిన మ్యూజిక్ హైలెట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇదిలా ఉంటే.. తాజాగా డాకు మహారాజ్ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో ప్రేక్షకులను స్వయంగా పలకరించారు బాలయ్య. సినిమా ఎలా ఉందంటూ అభిమానులను ఫోన్ కాల్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

బాలయ్య మాట్లాడిన ఫోన్ రికార్డింగ్స్ అభిమానులు నెట్టింట షేర్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉందంటూ బాలయ్య అడగ్గానే ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్, బంపర్ హిట్టు అంటూ చెప్పుకొచ్చారు. “కంగ్రాట్యులేషన్స్ అన్నగారు.. సూపర్ ఉంది సినిమా. మీ యాక్టింగ్ మాత్రం నటవిశ్వరూపం. అసలు ఫస్టాఫ్ చాలా పీక్ అన్నగారు. సెకండాఫ్ సెటిల్ యాక్టింగ్ చాలా బావుంది. ఒన్ మ్యాన్ షో అన్నగారు మీది. ప్లస్ థమన్ గారి బీజీఎం అదిరిపోయింది. బాబీ గారి టేకింగ్, విజువల్స్ అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మీ కెరీర్ లో” అంటూ ఓ ఫ్యాన్ చెప్పడంతో సంతోషంగా ఫీల్ అయ్యారు.

ఇలా పలువురు అభిమానులతో బాలయ్య మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్స్ ను ఫ్యాన్స్ నెట్టింట షేర్ చేస్తున్నారు. మరోవైపు డాకు మహారాజ్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్పటిలాగే సంక్రాంతి హీరో అని బాలయ్య నిరూపించుకున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..