Nandamuri Balakrishna: నట సింహం 107 సినిమాకు ముహూర్తం ఫిక్స్.. మూవీ ప్రారంభోత్సవం ఎప్పుడంటే..
నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ

Nandamuri Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా అంటే మాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. ఇక మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని వంటి డైరెక్టర్‌తో బాలకృష్ణ సినిమా అంటే అందరిలోనూ అంచనాలు ఆకాశన్నంటుతాయి. క్రాక్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన గోపీచంద్ మలినేని.. బాలకృష్ణ సినిమా కోసం అద్భుతమైన కథను సిద్దం చేశాడు. వాస్తవ ఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని ఈ కథను రాశారు. ఇటీవలే మాస్ రాజా రవితేజతో కలిసి క్రాక్ సినిమా చేశారు గోపి. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
పుల్ మాస్ మసాల కమర్షియల్ అంశాలతో రాబోతోన్న బాలయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఈ మూవీ ప్రారంభోత్సవం నవంబర్ 13, ఉదయం 10:26 గంటలకు ఘనంగా జరగనుంది. బాలకృష్ష సరసన శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అఖండ అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ ఈసినిమాలో బాలయ్య సరసన ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ చిత్రానికి సంబంధించిన పనులన్నీ ముగిసిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టనున్నారు నందమూరి బాలకృష్ణ.
The Hunt Begins Very Soon ?#NBK107 Muhurtham on 13th Nov at 10:26 AM ? #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @MusicThaman ♥️ pic.twitter.com/mdgdV04I4a
— Mythri Movie Makers (@MythriOfficial) November 10, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :