AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda Movie : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న ‘అఖండ’… బాలయ్య సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు..

మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మార్కెట్ రేంజ్ తగ్గుతోందనే అపవాదును మోస్తున్నారు బాలయ్య. అందుకే ఆయన్ను సింహంగా.. లెజండ్గా మార్చిన బోయపాటి శ్రీనుకే మరో సారి ఛాన్స్‌ ఇచ్చి సినిమాను మొదలెట్టాశారు.

Akhanda Movie : కరోనా కారణంగా ఆలస్యం అవుతున్న 'అఖండ'... బాలయ్య సినిమాకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులు..
Balakrishna Akhanda
Rajeev Rayala
|

Updated on: May 16, 2021 | 7:35 PM

Share

Akhanda Movie :

మిగతా సీనియర్ హీరోలతో పోలిస్తే మార్కెట్ రేంజ్ తగ్గుతోందనే అపవాదును మోస్తున్నారు బాలయ్య. అందుకే ఆయన్ను సింహంగా.. లెజండ్ గా మార్చిన బోయపాటి శ్రీనుకే మరో సారి ఛాన్స్‌ ఇచ్చి సినిమాను మొదలెట్టాశారు. ఈసారి ఎలాగైనా ఇండస్ట్రీ హిట్‌ కొట్టి బాలయ్య బ్యాక్‌టూ ఫాం అని నిరూపించుకోవానలకున్నారు. అనుకున్నదే తడవుగా సినిమా మొదలు పెట్టేసి “అఖండ” గా టీజర్ రిలీజ్‌ చేశారు.ఇక బోయపాటికి కూడా ప్రెస్టీజియస్ అయిన అఖండ మూవీ టీజర్ రికార్డులు బద్దలుకొడుతోంది. ఎంతలా అంటే.. సౌత్ ఇండియన్ స్టార్‌గా పిలిపించుకునే రజనీ కాంత్ రికార్డు కూడా చెరిగిపోయేంత. అవును ఈ టీజర్‌ రికార్డులు బద్దలు కొట్టడమే కాదు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోంది కూడా..! ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం  చేయబోతున్నారు. అందులో ఒకటి అఘోర పాత్ర. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలయ్యకు జోడీగా కంచె బ్యూటీ ప్రజ్ఞ జైస్వాల్ నటిస్తుంది.

అయితే టీజర్‌ రికార్డులు బద్దలు కొడుతున్నా “అఖండ” మాత్రం అక్కడే ఆగింది. ఇసుమంత కూడా ముందుకు కదలడం లేదు.. నిన్నమొన్నటి వరకు ప్రొడ్యూసర్‌ ఇష్యూతో ఆగిన అఖండ.. ఇప్పుడు కరోనా కారణంగా పట్టాలు తప్పింది. ఇక ఇదంతా చూస్తున్న బాలయ్య అభిమానులు “అఖండ మెల్లిగా వచ్చిన పర్లేదు కాని.. ఆగకుండా ఉంటే చాలు” అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్‌ కమెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bellamkonda Ganesh: బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. హిందీ మూవీ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న గణేష్..

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ – త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..