Bangarraju: దూసుకుపోతున్న చిన్న బంగార్రాజు పాట.. ఆకట్టుకుంటున్న ‘నా కోసం’ సాంగ్..
అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు.
Bangarraju: అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ బంగార్రాజు.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్ కృతి శెట్టికనిపించనుంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా రానుండటంతో బంగార్రాజు మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 2022లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా విడుదల చేసిన పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.
అలాగే ఈ సినిమానుంచి విడుదలైన మెలోడీ సాంగ్ నాకోసం మారవా.. నువ్వు అనే పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలాజీ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. ఇక ఈ పాట యూట్యూబ్ లో మరు మ్రోగుతుంది. ఈ పాట ట్రెండింగ్ లో నిలుస్తూ, 7 మిలియన్ పైగా వ్యూస్ ను రాబట్టింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :