MAA elections: ‘మా’ ఎపిసోడ్‌లో మల్టీ స్క్రీన్ ప్లే.. సిటీలో లేని ప్రకాశ్ రాజ్.. మరి సీన్ రక్తి కట్టించింది ఎవరు..?
'మా' ఎపిసోడ్‌ను మల్టీ స్క్రీన్ ప్లే.. షేక్ చేస్తోంది. మోనార్క్ ఎంట్రీతో మొదలై.. రోజు రోజుకూ మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు సరికొత్త యాంగిల్ స్ర్కీన్ పైకి వచ్చింది. రేటింగ్సును...
‘మా’ ఎపిసోడ్‌ను మల్టీ స్క్రీన్ ప్లే.. షేక్ చేస్తోంది. మోనార్క్ ఎంట్రీతో మొదలై.. రోజు రోజుకూ మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు సరికొత్త యాంగిల్ స్ర్కీన్ పైకి వచ్చింది. రేటింగ్సును బద్ధలు కొట్టి టీవీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన బిగ్ బాస్ ఇప్పుడు మెయిన్ ఫ్రేమ్‌గా మారింది. వీళ్లిప్పుడు ఏ శిబిరంలో ఉన్నారనేదే.. డిస్కషన్ పాయింట్. బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు అందరికీ ప్రకాశ్ రాజ్ ఆఫీసులో పార్టీ ఇవ్వబోతున్నట్టు.. ‘మా’ సర్కిల్‌లో తెగ ప్రచారం జరిగింది. ఈ పార్టీకి నాగార్జున కూడా రాబోతున్నట్టు.. గుసగుసలు వినిపించాయి. నాగ్ బర్త్‌డే సందర్భంగా.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం నైట్ పార్టీని ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చాయి. తీరా చూస్తే అక్కడ పార్టీ జరగలేదు. అసలు ప్రకాశ్ రాజు సిటీలోనే లేరు. మరి ఈ వార్త ఎట్టా లీకైందో.. పార్టీ ఉందంటూ ఎవరు ఆజ్యం పోశారో.. అర్ధం కావడం లేదు. నాగార్జున పేరును తెరపైకి ఎవరు తీసుకొచ్చానేది కూడా కన్ఫ్యూజనే.
అసలు విందు రాజకీయాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బోధపడటం లేదు. ఈ ప్రచారం ప్రకాష్ రాజ్, నాగార్జున తెలుసా లేదా అనే చర్చ జరుగుతోంది. ఇద్దరికీ తెలియకుండా ఎవరైనా పుకార్లు పుట్టించారా అనేదే సస్పెన్స్. ఇప్పటివరకూ జరిగిన నాలుగు సీజన్లలో మొత్తంగా 66 మంది పార్టిసిపేట్ చేశారు. వీళ్లలో చాలా మందికి ‘మా’ అసోషియేషన్‌లో మెంబర్ షిప్ ఉంది. ఈ కీ పాయింట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీళ్ళంతా ఇప్పుడు ‘మా’ ఎన్నికల్లో ఎటువైపు నిలవబోతున్నారు. ఏ ప్యానల్‌లో ఎవరు చేరబోతున్నారనే దానిపై క్లారిటీ లేదు. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇలాంటి సమయంలోనే పార్టీ అంశం తెరపైకి వచ్చింది.
Also Read: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య.. తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా