AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sattenapalli: తల్లికూతుళ్లపై కత్తితో ఉన్మాది దాడి .. ఇళ్లంతా రక్తపు మడుగు.. ఇద్దరూ కన్నుమూత

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతుళ్లపై కత్తి దూసాడో దుర్మార్గుడు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు.  నాగార్జున నగర్‌లోని...

Sattenapalli: తల్లికూతుళ్లపై కత్తితో ఉన్మాది దాడి .. ఇళ్లంతా రక్తపు మడుగు.. ఇద్దరూ కన్నుమూత
murders
Ram Naramaneni
|

Updated on: Aug 29, 2021 | 12:31 PM

Share

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లికూతుళ్లపై కత్తి దూసాడో దుర్మార్గుడు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు.  నాగార్జున నగర్‌లోని ఇంట్లో పద్మావతి, ప్రత్యూష ఉంటున్నారు. ఇంట్లో వాళ్లిద్దరే ఉన్న టైమ్‌లో ఎంటరైన శ్రీనివాస్‌రావు ఇద్దరినీ పొడిచాడు. అనంతరం తాపీగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ.. కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసింది. అవే ఆమె చివరి మాటలయ్యాయి. ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికెళ్లి చూసేసరికి.. తల్లీకూతుళ్లు చనిపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ షాక్‌కు గురిచేసింది.

ఆస్తి వివాదమే ఈ జంట హత్యలకు కారణమైందని పోలీసులు తెలిపారు. తల్లీకుమార్తెలను వారి బంధువే హతమార్చినట్లు  డీఎస్పీ విజయభాస్కరరెడ్డి వెల్లడించారు. సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్‌ నాలుగేళ్ల కిందట మరణించారని….. కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నట్లు వివరించారు. తల్లి వెంకట సుగుణ పద్మావతితో కలిసి నాగార్జుననగర్‌లో ఉంటున్న లక్ష్మీనారాయణ.. తన సోదరి లక్ష్మీప్రత్యూషకు  పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5నెలల కిందటే వివాహం జరిపించారని పేర్కొన్నారు. ప్రస్తుతం గర్భిణి అయిన లక్ష్మీప్రత్యూష శ్రావణమాసం కావడంతో సారె కోసం తల్లిగారింటికి భర్తతో సహా వచ్చారని.. తిరిగి అల్లుడు ఒక్కరే స్వగ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. ఇంతలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

Also Read: పెళ్లైన మూడు రోజులకే ప్రెగ్నెంట్ .. కూపీ లాగగా నిజాలు తెలిసి విస్తుపోయిన పోలీసులు

వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ