Jangareddygudem: వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం

ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిల్వచేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే...

Jangareddygudem: వర్షాలకు బయటపడ్డ కరోనా బాధితుడి మృతదేహం.. స్థానికంగా కలకలం
Corona Dead Body
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 29, 2021 | 4:49 PM

ఏపీలో కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు నిల్వచేరాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాలకు ఖననం చేసిన మృతదేహం బయటపడటం కలకలం రేపింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజారాణి కల్యాణ మండపం సమీపంలోని శ్మశాన వాటికలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.  ఐదు నెలల కిందట కరోనాతో మృతి చెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఈ శ్మశాన వాటికలో ఖననం చేశారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి డెడ్‌బాడీ బయటపడింది. దీనిని గుర్తించిన పోలీసులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఆ మృతదేహాన్ని తిరిగి ఖననం చేయించామని పురపాలక కమిషనర్‌ శ్రావణ్‌కుమార్‌ సిబ్బందిని ఆదేశించారు. కరోనా బాధితుల మృతదేహాలను నిబంధనల మేరకు పూడ్చకపోవడం వల్లే ఇలా బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ఇంకెన్ని బయట పడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

ఏపీలో కొనసాగుతోన్న కరోనా వ్యాప్తి 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. ఓ రోజు ఎక్కువ.. మరో రోజు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1000పైనే కేసులు వెలుగుచూశాయి. కొత్తగా 24 గంటల వ్యవధిలో 64,461 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 1321 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం సాయంత్రం వెల్లడించింది. తాజాగా నమోదైన 1321 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,10,566కి పెరిగింది. కొత్తగా కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,807కి చేరింది. ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1499 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో వ్యాధి బారినుంచి బయటపడినవారి సంఖ్య 19,81,906కి చేరింది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి.

Also Read:భారత్‌లో టెన్షన్ పెడుతున్న కొత్త కేసులు, మరణాలు.. తాజా వివరాలు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక.. అధికారులు అలెర్ట్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే