Vishal: విశాల్ 31 సినిమా టైటిల్ ప్రకటన.. త్వరలో ‘సామాన్యుడి’గా ప్రేక్షకుల ముందుకు..

Vishal: హీరో విశాల్ తమిళ్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తన యాక్షన్‌ సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తాడు.

Vishal: విశాల్ 31 సినిమా టైటిల్ ప్రకటన.. త్వరలో 'సామాన్యుడి'గా ప్రేక్షకుల ముందుకు..
Vishal Samanyudu Movie
Follow us

|

Updated on: Aug 29, 2021 | 12:52 PM

Vishal: హీరో విశాల్ తమిళ్, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. తన యాక్షన్‌ సినిమాలతో అభిమానులను ఉర్రూతలూగిస్తాడు. వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించాడు. సామాన్య ప్రేక్షకుడికి వినోదం అందించడంలో విశాలు సినిమాలు ముందువరుసలో ఉంటాయని టాక్. ఇప్పటి వరకు 30 సినిమాలు చేసిన విశాల్ తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ 31 సినిమా టైటిల్ ప్రకటించి బర్త్ డే విషెస్ తెలిపారు.

సామాన్యుడు “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్‌తో తెలుగులో ఈ మూవీ త్వరలో విడుదలకానుంది. పా శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శ‌ర‌వ‌ణ‌న్ విశాల్ 31వ సినిమాను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరి బేన‌ర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఓ సారి క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ‌గా, మరోసారి విశాల్‌కి అయిన గాయం వల్ల ఆగింది.

ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లో విశాల్ గాయ‌ప‌డ్డాడు. ఆ గాయం కారణంగా విశాల్ కు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించ‌డంతో ఈ మూవీకి బ్రేక్ ప‌డింది. ఇప్పటికే వదిలిన టీజర్లు,పోస్టర్లు అదిరిపోయాయి. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన‌ట్టు తెలుస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించవచ్చు. హీరో విశాల్ గత కొద్ది కాలంగా నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ఆయన హీరోగా నటించిన చక్ర సినిమాపై.. నిర్మాతలపై.. హీరోపై లైకా ప్రొడక్షన్ సంస్థ కాపీ రైట్స్ ఆరోపణలు చేస్తూ కేసు వేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా స్టోరీని ఆ మూవీ డైరెక్టర్ ముందుగా తమకు వినిపించారని.. తమతోనే నిర్మిస్తానని డైరెక్టర్ అన్నారని కానీ చివరకు ఆ సినిమాను విశాల్ నిర్మించాడని లైకా సంస్థ ఆరోపించింది. ఎట్టకేలకు ఈ కేసు విచారణ చెపట్టింది హైకోర్టు. అయితే లైకా వేసిన కేసులు, ఆరోపణలు అన్ని తప్పుడుగా కనిపిస్తున్నాయని కేసును కొట్టి వేసింది. అంతేకాకుండా లైకాకు ఐదు లక్షల జరిమానా కూడా విధించింది.

Vizianagaram: హాస్టల్ గదిలో ట్రైనీ ఎస్‌ఐ భవానీ ఆత్మహత్య.. తెల్లారితే ఇంటికి వెళ్లాలనగా

IRCTC: ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు బహుమతుల బొనాంజా.. స్పెషల్ ఆఫర్ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..

Afghanistan Crisis: ప్రపంచానికే ముప్పు తెచ్చిన అమెరికా పలాయన వాదం..ఆఫ్ఘన్ లో అమెరికా చేసిన నిర్వాకం ఇదీ!