AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sobhan Babu: తరాలు తిన్నా తరగని సంపదన ఈ అందాల నటుడు సొంతం.. కెరీర్ మొదట్లో రూ.250 కోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..

Sobhan Babu: సినీరంగ ప్రముఖుల చూసి.. వారికేమిటండి.. కోట్లకు కోట్లు కూడబెట్టారు.. హ్యాపీగా ఇప్పుడు అనుభవిస్తున్నారు.. అంటూ మాట్లాడేవారున్నారు.. సినీ నటుల వైభవం చూసి..

Sobhan Babu: తరాలు తిన్నా తరగని సంపదన ఈ అందాల నటుడు సొంతం.. కెరీర్ మొదట్లో రూ.250 కోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..
Sobhan Babu
Surya Kala
|

Updated on: Aug 29, 2021 | 1:45 PM

Share

Sobhan Babu: సినీరంగ ప్రముఖుల చూసి.. వారికేమిటండి.. కోట్లకు కోట్లు కూడబెట్టారు.. హ్యాపీగా ఇప్పుడు అనుభవిస్తున్నారు.. అంటూ మాట్లాడేవారున్నారు.. సినీ నటుల వైభవం చూసి అసూయపడే వారు కూడా కోకొల్లలు.. అయితే ఇప్పుడు కోటీశ్వరులైన నటీనటులు.. కెరీర్ మొదట్లో కూటికోసం కోటి తిప్పలు పడినవారు ఎందరో.. తినే తినక.. ఎన్నో కష్టనష్టాలకోర్చి.. పట్టుదలతో చలన చిత్ర పరిశ్రమలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. తరతరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదించిన హీరో అనగానే వెంటనే అలనాటి వారికీ శోభన్ బాబు గుర్తు కోస్తాడు.. ఎందుకంటే ఆయన కారు డ్రైవర్ కూడా ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపతే మరి..

ఈ ప్రపంచంలో భూమి అనేది 25శాత‌మే ఉంది. ఇందులో మంచుకొండ‌ల్లో, ఎడారుల్లో నివ‌శించ‌లేం. ఇక 15శాత‌మే మ‌నుషులు నివశించడానికి అనుకూలం.. ఇక భూమిని మ‌నం త‌యారుచేయ‌లేం. రాబోయే రోజుల్లో భూమికి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే నాకు వ‌చ్చే రెమ్యూన‌రేష‌న్‌తో ల్యాండ్స్ కొంటున్నా. మీరు కూడా మీ సంపాదనలో కొంతభాగం సేవ్ చేసి.. భూమిని కొనే దిశ‌గా ప్ర‌య‌త్నించు’ అని ఆయన ప్రతి ఒక్క నటీ నటులకు ఓ పాఠం లాగా వెంటబడి మరీ చెప్పేవారు. ఈ విషయం అందరికీ చెప్పడమే కాదు శోభన్ బాబు అక్షరాలా ఆచరించి చూపించారు. అందుల్లనే చెన్నై సహా పలు ప్రాంతాల్లో భూములు కొన్న శోభన్ బాబు కొన్ని తరాలు తిన్నా తరగని ఆస్తులు తన పిల్లలకు ఇచ్చి వెళ్లారు.

అయితే ఈ వెండితెర అందగాడుగా, ఆంధ్రుల అభిమాన హీరోగా శోభన్ బాబు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. ముక్కుసూటితనంగా మాట్లాడుతూ.. వివాదాలకు దూరంగా ఉంటూ తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడిగా మంచి పేరును సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు ;లా’ చదువుకున్నారు. అయితే నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో శోభన్ బాబుకి పెద్దగా గుర్తింపు రాలేదు.. సరైన సంపాదన లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం అనేక కష్టలు పడ్డారని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. నెలకు రూ. 250లను సంపాదించడం తాను పడిన ఇబ్బందులను ఆ సమయంలో గుర్తు చేసుకున్నారు.

కెరీర్ మొదట్లోనే పెళ్లి అయిన శోభన్ బాబుకి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ భారమైంది. కాఫీ తాగితే భోజనం ఉండేది కాదు భోజనం తింటే కాఫీ ఉండేది కాదు. అప్పుడు నెలకు రూ. 250 ఖర్చు అయ్యేది. దీంతో వచ్చిన వేషాలను చిన్నవా పెద్దవా అని ఆలోచించకుండా వచ్చిన వేషాలను అవకాశాలను అందిపుచ్చుకుని నటించారు. అంతేకాదు.. డబ్బుల కోసం చేసిన రెండు బిజినెస్ లు తనను ఆర్ధికంగా ఇబ్బంది పెట్టాయని గుర్తు చేసుకున్నారు ఒకసారి. అనంతరం భూముల మీద పెట్టుబడి పెట్టి.. తాను మరణించినా తన వారసులకు తరగని సంపదను ఇచ్చారు శోభన్ బాబు.

Also Read: కృష్ణాష్టమిరోజున సంతానం లేనివారు ఇలా పూజిస్తే సంతానం కలుగుతుందట.. ఈ సంబరాల పరమార్ధం ఇదే