Nagarjuna: డెవిల్ ఈజ్ బ్యాక్.. స్వర్గం నుంచి దిగివస్తున్న బంగార్రాజు.. నాగ్ ఫస్ట్‏లుక్ అదుర్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున హవా కొనసాగుతుంది. ఈరోజు నాగ్ బర్త్ డే కావడంతో నెట్టింట్లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు పుట్టిన

Nagarjuna: డెవిల్ ఈజ్ బ్యాక్.. స్వర్గం నుంచి దిగివస్తున్న బంగార్రాజు.. నాగ్ ఫస్ట్‏లుక్ అదుర్స్..
Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 29, 2021 | 2:20 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ నాగార్జున హవా కొనసాగుతుంది. ఈరోజు నాగ్ బర్త్ డే కావడంతో నెట్టింట్లో అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాకుండా.. నాగ్ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్‏డేట్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగార్జున్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది… ఇటు కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలో బంగార్రాజు మూవీ కూడా చేస్తున్నాడు నాగ్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీకి సిక్వెల్‏గా బంగార్రాజు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.

ఈరోజు (ఆగస్ట్ 29)న నాగ్ పుట్టిన రోజు సందర్భంగా.. బంగార్రాజు సినిమా ఫస్ట్‏లుక్ పోస్టర్‏ను నాగ్ తనయుడు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా విడుదల చేశాడు. అందులో డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ నాగార్జున స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా కనిపించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో శరవేగంగా జరుగుతుంది.

ట్వీట్..

Also Read: Sobhan Babu: తరాలు తిన్నా తరగని సంపదన ఈ అందాల నటుడు సొంతం.. కెరీర్ మొదట్లో రూ.250 కోసం ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా..

MAA elections: ‘మా’ ఎపిసోడ్‌లో మల్టీ స్క్రీన్ ప్లే.. సిటీలో లేని ప్రకాశ్ రాజ్.. మరి సీన్ రక్తి కట్టించింది ఎవరు..?

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?