Actress Pakeezah Vasuki: పాకీజా పరిస్థితి తెలుసుకొని ఆర్ధిక సాయం చేసిన నటుడు.. కాళ్లు మొక్కుతానని నటి ఎమోషనల్
ఒకప్పుడు వరస సినిమాలతో ఖాళీ లేకుండా గడిపిన సినిమా నటులు ఇప్పుడు చేసేందుకు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. అయితే కొంతమంది పరిస్థితీ మరీ దారుణం అనే చెప్పాలి.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఒకప్పుడు స్టార్ స్టేటస్ అనుభవించి ఇప్పుడు కనీసం ఇళ్ళులేక ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు వరస సినిమాలతో ఖాళీ లేకుండా గడిపిన సినిమా నటులు ఇప్పుడు చేసేందుకు పనిలేక ఖాళీగా ఉంటున్నారు. అయితే కొంతమంది పరిస్థితీ మరీ దారుణం అనే చెప్పాలి. ఉండటానికి ఇల్లు లేక, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతూ.. నానా కష్టాలు పడుతున్నారు.అలానే నటి పాకీజా కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పాకీజా ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు ఆమె బిజీ ఆర్టిస్ట్. ఆమె డేట్స్ కూడా దొరికేవి కావట.. అంత బిజీగా గడిపిన పాకీజా ఇప్పుడు సినిమా ఛాన్స్ లు లేక.. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాకీజా అసలు పేరు వాసుకి.. ఆమె కామెడీ ప్రధాన పాత్రలు చేసి పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఒక హాస్టల్ లో ఉంటూ కాలం గడుపుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆమె దీన పరిస్థితి గురించి తెలిపారు.
అయితే పాకీజా పరిస్థితి తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఆమెకు ఆర్ధికంగా సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాకీజాగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టు ఇప్పుడు ఇలా కష్టాల్లో ఉండటం చూస్తే బాధగా ఉంది అన్నారు. బుల్లితెర కానీ, సినిమాల్లో కానీ.. చిన్నదో పెద్దదో ఒక పాత్ర ఆవిడకు ఇచ్చి మళ్లీ తన కాళ్ల మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సాయపడాలి. నేను కూడా నావంతు ప్రయత్నం చేస్తాను’’ అన్నారు. అలాగే ఆమెకు లక్షరూపాయల ఆర్ధిక సాయం అందించారు నాగబాబు. నాగబాబు సాయం అందించారని తెలుసుకొని పాకీజా సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతా అని అన్నారు. తమిళ్ లో నన్ను పట్టించుకోలేదు.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు నేను ఒక ముద్ద తింటున్నాను అంటే అది తెలుగువాళ్లు వల్లే అంటూ ఎమోషనల్ అయ్యారు పాకీజా.. Nagababu