AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya – Sobitha: గుడ్ న్యూస్ నిజమేనా? ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అక్కినేని కోడలు

మెగా కోడలు, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠీ త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ఈ విషయాన్ని వారే అధికారికంగా ప్రకటించారు. అయితే లావణ్య లాగే శోభిత కూడా గుడ్ న్యూస్ చెప్పనుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది శోభిత.

Naga Chaitanya – Sobitha: గుడ్ న్యూస్ నిజమేనా? ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన అక్కినేని కోడలు
Naga Chaitanya, Sobhita Dhulipalla
Basha Shek
|

Updated on: May 08, 2025 | 11:50 AM

Share

మెగా కోడలు లావణ్య త్రిపాఠీ గర్భంతో ఉందని గత కొన్ని రోజులుగా నెట్టింట ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రూమర్లు ఇప్పుడు నిజమయ్యాయి. తాము త్వరలో తల్లిదండ్రులం కానున్నామంటూ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ సోషల్ మీడియా వేదికగా అందరికీ గుడ్ న్యూస్ వినిపించారు. అయితే లావణ్య లాగే అక్కినేని కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత ధూళిపాల గురించి కూడా ప్రెగ్నెన్సీ రూమర్లు వినిపిస్తున్నాయి. ఆమె గర్భంతో ఉందని నెట్టింట విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల ముంబైలో జరిగిన WAVES -2025 సమ్మిలో శోభిత ధూళిపాల వదులుగా ఉండే చీర కట్టులో కనిపించడం తో ఈ ప్రెగ్నెన్సీ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. లావణ్య- వరుణ్ తేజ్ లాగే నాగ చైతన్య- శోభిత కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై శోభిత టీమ్ స్పందించింది. ‘గుడ్‌ న్యూస్‌ ’ ఒట్టి పుకారు మాత్రమే. శోభిత పర్సనల్‌ లైఫ్‌ గురించి వినిపిపస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె టీమ్‌ ప్రకటించింది. ప్రస్తుతం శోభిత తన వైవాహిక జీవితం ఆస్వాదిస్తోందని, మాతృత్వంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె టీమ్‌ స్ఫస్టం చేసింది.

ఇక ఇటీవల శోభిత వదులుగా ఉండే చీర ధరించడంపైనా శోభిత స్పందించింది. ‘ అది మెటర్నిటీ డ్రెస్సు కాదు, యాంటీ-ఫిట్ డ్రెస్సు వేసుకుంది. కేవలం వస్త్ర ధారణ వల్ల ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యంగా ఉంది’ అని క్లారిటీ ఇచ్చింది. తద్వారా తన గురించి వస్తోన్న ప్రెగ్నెన్సీ రూమర్లను కొట్టిపారేసింది అక్కినేని కోడలు.

ఇవి కూడా చదవండి

శొభిత లేటెస్ట్ ఫొటోస్..

కాగా గతేడాది డిసెంబర్ లో నాగ చైతన్య, శోభితల వివాహం జరిగింది. పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోందీ అందాల తార. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను అందులో పంచుకుంటోంది. ఇక నాగ చైతన్యం మాత్రం పెళ్లి తర్వాత తండేల్ లో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక్‌ దండు దర్శకత్వంలో ఓ మైథాలాజికల్‌ థ్రిల్లర్‌ సినిమా చేస్తున్నాడు.

భర్త నాగచైతన్యతో కలిసి..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

Follow Us
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
మేకప్ లేకుండా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి.. ఫొటోస్ ఇదిగో
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
భారత్ ఘన విజయం.. సెమీస్ ఆశలు సజీవం..
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ట్యాన్‌ తొలగించే సింపుల్ ఇంటి చిట్కాలు.. ఇలా ట్రై చేశారంటే...
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు.. ఆరోగ్యానికి ఏది నిజమైన అమృతం..?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
మీరు షాపుల్లో కొనే అల్లం పేస్ట్ ఎలా తయారు చేస్తారో తెలుసా?
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
గీత గోవిందం ప్రేమ ప్రయాణం.. విజయ్ రష్మికల ఏడడుగుల బంధం..
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఒకవైపు కల్తీ మద్యం కాటు… మరోవైపు కాస్ట్లీ బ్రాండ్ల అక్రమ రవాణా!
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి.. తల్లి వెళ్లి చూసేసరికే ఊహించని..
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సమస్తం కల్తీ మయం! మన కిచెన్‌లోనే ఇన్ని కల్తీలా.?
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్
సొంతింటి కలను నెరవేర్చుకున్న బిగ్ బాస్ విన్నర్ నిఖిల్.. ఫొటోస్