AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: నాగచైతన్యకు కోడలిగా, రజినీకాంత్ ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏడు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తున్నారు తలైవా.

Naga Chaitanya: నాగచైతన్యకు కోడలిగా, రజినీకాంత్ ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
Naga Chaitanya, Rajinikanth
Rajitha Chanti
|

Updated on: May 08, 2025 | 12:51 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా తలైవా.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తలైవాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గా్ల్లో తెగ చర్చ నడుస్తుంది. అదేంటంటే.. రజినీకాంత్ భార్యగా నటించిన ఓ హీరోయిన్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యకు కోడలిగా నటించిందన్న సంగతి మీకు తెలుసా.. ? అవును.. రజినీతో పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత ఓ సినిమాలో నాగార్జున భార్యగా.. చైతన్యకు కోడలిగా కనిపించింది.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?తనే హీరోయిన్ శ్రియా శరణ్. ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి ఈ ముద్దుగుమ్మ. మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అంతేకాదు.. ఆ తర్వాత వచ్చిన స్టార్స్ ప్రభాస్, ఎన్టీఆర్ వంటి యంగ్ హీరోలకు జోడిగా మెప్పించింది. కానీ పెళ్లి తర్వాత ఈ అమ్మడు జోరు తగ్గించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తుంది. అలాగే నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ పోస్టులు చేస్తుంది.

ఇదిలా ఉంటే.. నాగార్జున సరసన నేనున్నాను సినిమాతో హిట్ అందుకుంది శ్రియా. అప్పట్లో ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అదే సమయంలో రజినీకాంత్ నటించిన శివాజీ చిత్రంలోనూ కనిపించింది. ఇందులో రజినీ భార్యగా నటించింది. డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక కొన్నాళ్లు సినిమాల్లో సైలెంట్ అయిన శ్రియా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మనం సినిమాలోనూ మెరిసింది. ఇందులో నాగార్జున భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో చైతన్య తనయుడిగా నాగార్జున కనిపించిన సంగతి తెలిసిందే. అంటే మనం సినిమాలో చైతన్యకు శ్రియా కోడలు అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది శ్రియా. నిత్యం గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కట్టిపడేస్తుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..

మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
మీ తలరాత మారాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి.. చాణక్యుడు..
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వయసు పెరిగిందనుంటే పొరపాటే.. పట్టపగలే చుక్కలు చూపించే హిట్టర్లు
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
వాషింగ్ మెషిన్‌తో కరెంట్ బిల్ తగ్గించే ఈజీ టిప్.. ఈ సీక్రెట్
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ?
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
కాఫీ ఇలా తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. కానీ ఈ తప్పులు చేశారో..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
పెళ్లైన 3 నెలలకే భర్తను లేపేసిన భార్య.. సరదాగా బయటకు తీసుకెళ్లి..
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
వరల్డ్ కప్‌లో నంబర్ 1 బౌలర్..సొంత దేశానికి వెళ్లాలంటే వణుతున్నాడు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
బయట ఫుడ్ తినే అలవాటు ఉందా.? ఇది చూస్తే జన్మలో మళ్లీ ముట్టుకోరు
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
మహిళల కోసం మరో కొత్త పథకం.. అవన్నీ ఫ్రీ
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..
ఆ తప్పు చేయకపోతే ఇప్పటికీ స్టార్ హీరోగా ఉండేవాడు..