Naga Chaitanya: సూపర్ హిట్ ‘మజిలీ’ కాంబినేషన్ రిపీట్.. ఆ డైరెక్టర్‏తో చైతూ మరో సినిమా ?..

ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీ అయిన మజిలీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని సమాచారం. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Naga Chaitanya: సూపర్ హిట్ 'మజిలీ' కాంబినేషన్ రిపీట్.. ఆ డైరెక్టర్‏తో చైతూ మరో సినిమా ?..
Majili Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 03, 2023 | 9:41 AM

కస్టడీ సినిమాతో హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నారు అక్కినేని నాగచైతన్య. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ హీరో నటిస్తున్న ఈ సినిమాపై అటు అక్కినేని ఫ్యాన్స్ ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగుతోపాటు తమిళ్ భాషలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ మే 5న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు చైతూ. అయితే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో చైతూ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తోంది. తన కెరీర్ లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీ అయిన మజిలీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతుందని సమాచారం. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇందులో చైతూ.. సామ్ నటనకు…వారిద్దరి మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా చేయాలనుకున్నారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమానే ఖుషీ పేరిట సమంత.. విజయ్ దేవరకొండతో తీస్తున్నారట. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

అదేంటంటే.. డైరెక్టర్ శివ నిర్వాణ నెక్ట్ ప్రాజెక్ట్ చైతూతో అని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఓ ఫ్యామిలీ డ్రామా రాబోతుందట. ఇప్పటికే చైతూకు స్టోరీ వినిపించగా.. ఓకే చేశారని.. ఖుషి చిత్రం అనంతరం వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మజిలీ చిత్రంలో చైతూ నటన.. తన క్యారెక్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో చైతూని డైరెక్టర్ శివ నిర్వాణ చూపించిన విధానం జనాలు తెగ నచ్చేసింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.