Zebra OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లోకి సరికొత్త సూపర్ హిట్ చిత్రాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య హారర్ కంటెంట్ చిత్రాలను చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. కానీ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్, యాక్షన్ డ్రామాలకు ప్రేక్షకుల ఆదరణ పెరిగిపోతుంది. ఈ క్రమంలో తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అడియన్స్ ముందుకు వచ్చేసింది.

Zebra OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..
Zebra Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2024 | 11:55 AM

డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో హీరో సత్యరాజ్ నటించిన లేటేస్ట్ సినిమా జీబ్రా. ఇందులో ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్లుగా నటించారు. నవంబర్ 22న విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇటీవల హయ్యేస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాగా నిలిచింది. పాజిటివ్ టాక్ తో మొదటి వారాల్లో మంచి వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా డిసెంబర్ 20 నుంచి అంటే ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ధరకే కొనుగోలు చేసింది ఆహా. ఇటీవల ఈ సినిమాకు స్పెషల్ కాంటెస్ట్ కూడా నిర్వహించింది చిత్రయూనిట్.

ఈ సినిమాలో హీరో సత్యదేవ్ ఆహా ఓటీటీ నిర్వహిస్తున్న జీబ్రా ప్రత్యేక పోటీలో గెలిచిన వారికి తనకు ఇష్టమైన వాచ్, గ్లాసెస్ బహుమతిగా అందిస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబ్ చేసి..సినిమా చూసే అభిమానులకు సత్యదేవ్, నటుడు సునీల్ తోపాటు లీడ్ చేసిన యాక్టర్స్ ధరించే ప్రత్యేకమైన వస్తువులను గెలుచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీబ్రా మూవీ తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి

కథ విషయానికి వస్తే.. సూర్య (సత్యదేవ్) ప్రైవేటు బ్యాంకు ఎంప్లాయ్. బ్యాంకింగ్ వ్యవస్థతోపాటు అందులోని లోతుపాతులపై పూర్తిగా అవగాహన ఉంటుంది. తన బ్యాంకులోనే పనిచేసే స్వాతిని (ప్రియా భవానీ శంకర్)ను ఇష్టపడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే స్వాతి పొరపాటున ఓ వ్యక్తి ఖాతాలో జమ చేయాల్సిన డబ్బును మరొకరి ఖాతాలో జమ చేస్తుంది. దీంతో తన తెలివితేటలతో స్వాతిని ఆ సమస్య నుంచి కాపాడతాడు సూర్య. అదే సమయంలో బ్యాంకులో జరుగుతున్న స్కామ్ గురించి తెలుసుకుంటాడు. దీంతో సూర్యకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.