AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Movie OTT : ఓటీటీలోకి కేసీఆర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

జబర్దస్త్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్నావు వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. తన కామెడీ టైమింగ్ తోనే కాదు ఇప్పుడు నటుడిగాను ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే కేసీఆర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. నవంబర్ నెలలో కేసీఆర్ సినిమా విడుదలైంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

KCR Movie OTT : ఓటీటీలోకి కేసీఆర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
Kcr Movie
Rajeev Rayala
|

Updated on: Dec 20, 2024 | 3:01 PM

Share

ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు అలరిస్తున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్స్ లో సినిమాలను ఆదరించిన అభిమానులు.. ఓటీటీలోనూ సినిమాలను తెగ చూస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోకపోయినా.. ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతివారం కొత్త సినిమాలు ఓటీటీలో విడుదలై సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలోకి రానుంది. అదే కేసీఆర్( కేశవ చంద్ర రమావత్). జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు, కమెడియన్ రాకింగ్ రాకేష్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. జబర్దస్త్ ద్వారా  చాలా మంది పాపులర్ అయ్యారు. అలాగే కొంతమంది సినిమాల్లోకి అడుగుపెట్టారు. కొంతమంది హీరోలుగా చేస్తుంటే మరికొంతమంది డైరెక్టర్స్ గా మారారు. అలాగే రాకింగ్ రాకేష్ హీరోగా మారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఇది కూడా చదవండి : మాఫియా డాన్‌తో ఎఫర్ పెట్టుకుంది.. డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. కట్ చేస్తే సన్యాసిగా..

కేసీఆర్ సినిమా నవంబర్‌ 22న విడుదలైంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. కేసీఆర్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో రాకింగ్ రాకేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకు గరుడ వేగ అంజి దర్శకత్వం వహించాడు.అలాగే ఈసినిమాలో రాకింగ్ రాకేష్ తో పాటు అనన్య కృష్ణన్‌, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదిలా ఉంటే థియటర్స్ లో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి : సమంత, శోభిత.. ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలుసా…? మీరు అస్సలు ఊహించలేరు

ఇటీవలే ఈ సినిమా సక్సెస్ మీట్ జరిగింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో కేసీఆర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. అలాగే రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. ఈ మూవీ ఓటీటీ పార్ట్నర్ గురించి తెలిపాడు. సినిమా ఏ ఓటీటీలో రాబోతుందో చెప్పాడు రాకేష్. కానీ డేట్ మాత్రం చెప్పలేదు. కేసీఆర్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో తెలుపలేదు. డిసెంబర్ నెలాఖరున లేదా జనవరి ఫస్ట్ వీక్‌లో కేసీఆర్ మూవీ ఓటీటీలోకి వస్తుందని ఫిలిం సర్కిల్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే రాకింగ్ రాకేష్ రాసుకున్నాడు. అలాగే సినిమాలో లంబాడి యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ మూవీలో అతని భార్య సుజాత కూడా నటించింది. మరి ఈ సినిమా ఓటీటీ వార్తల పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Rajamouli: రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్.. అది కూడా రెమ్యునరేషన్ కోసం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us