Telangana Assembly: బీఆర్ఎస్ vs కాంగ్రెస్.. వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరగనుంది.. ఇవాళ కూడా పలు బిల్లులపై చర్చ కొనసాగనుంది.. కాగా.. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అవుతోంది. దీనిపై బీఆర్ఎస్ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది..
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదవ్వడంపై బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ సర్కార్ పై ఫైర్ అవుతోంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ కేసు నమోదు చేసంది.. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగంతో కేటీఆర్‌పై 4 సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు ఏసీబీ అధికారులు. మొదట కేటీఆర్‌కు నోటీసులు పంపి.. ఆ తర్వాత విచారణకు పిలవనునుంది ఏసీబీ.. ఈ క్రమంలోనే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరగనుంది.. ఇవాళ కూడా పలు బిల్లులపై చర్చ కొనసాగనుంది.. అయితే.. కేటీఆర్ పై కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది.. ఫార్ములా-ఈపై చర్చకు బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చర్చ కోసం పట్టుబట్టనున్నారు.
స్పందించిన కేటీఆర్..
అయితే.. తనమీద నమోదైన కేసుపై కేటీఆర్ ఇప్పటికే అసెంబ్లీలో స్పందించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఫార్ములా-ఈపై అసెంబ్లీలో చర్చపెట్టాలన్నారు. అసెంబ్లీలో చర్చకు తాను సిద్ధమే అన్నారు. కుంభకోణం జరిగిందంటున్నారు..అన్నింటికీ అసెంబ్లీలోనే సమాధానం చెబుతానన్నారు కేటీఆర్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

