కొంతమంది సినిమాలు, లేదా సిరీస్ చూస్తున్నప్పుడు మూత్రం వచ్చినా ఆపుకుంటారు. అలాగే కొందరు దూర ప్రయాణాలు చేస్తున్నాప్పుడు మూత్రం వచ్చినా బస్సు డ్రైవర్‌ను సైడ్‌కు ఆపుకొమని చెప్పడానికి మొహమాటపడుతూ ఉంటారు.
అయితే అలా మూత్రం ఆపుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణుల చెబుతున్నారు. మూత్రం ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు చెబుతున్నారు.
మూత్రాశయం సగటున 400-600 మి.లీ నిండినప్పుడు.. మెదడుకు సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఇది మూత్రం బయటకు పంపించాలని మెదడుకు చెబుతుంది.
ఒకేవేళ మనం మూత్రం బయటకు పంపించాలనుకుంటే మెదడు మూత్రాశయ కండరాలు సంకోచించమని మెసేజ్ పంపుతూ ఉంటుంది. ఇది స్పింక్టర్ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సిగ్నల్స్ సెండ్ చేస్తుంది.
అయితే మీరు టాయిలెట్ ఆపుకోవడం వల్ల మెదడు స్పింక్టర్ కండరాలను బిగించమని సూచిస్తుంది. దీంతో మూత్రం బయటకు రాదు. అయితే ఎప్పుడో ఒక్కసారి ఇలా చేస్తే ఏం కాదు గానీ.. ప్రతిసారి ఇలానే చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.
మూత్రం ఆపుకుంటే మూత్రశమం దాని లీమిట్ కన్నా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దీంతో కండరాలు వీక్ అవుతాయి. దీని వల్ల కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
మూత్రం ఆపుకుంటే అది కాస్త కిడ్నీలోకి వెళ్లే ప్రమాదం ఉంది. కిడ్నీలోకి వెళ్లతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. దీని ద్వారా కిడ్నీ దెబ్బతింటుంది.
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల మూత్రశయ రాళ్లు వస్తాయి. అవి మూత్రాన్ని బయటకు పంపిచేటప్పడు ప్రవాహాన్ని నిరోధించి నొప్పిని కలిగిస్తాయి.