D vitamin deficiency: ఎండ పుష్కలంగా ఉండే భారత్‌లో.. విటమిన్ డీ లోపమే ఎందుకు ఎక్కువ?
డీ విటమిన్ మానవ శరీరానికి ఎంతో ముఖ్యం. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచే కాల్షియంను గ్రహించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరగుదలకు సాయపడుతుంది. ఇంత ముఖ్యమైన డీ విటమిన్ను సూర్యరశ్మి పుష్కలంగా లభించే భారత్లో సులభంగానే పొందవచ్చు. అయినా మన దేశంలోనే ఎక్కువమంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఇందుకు కారణాలేంటి?
భారత్ ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వల్ల సూర్యరశ్మికి కొదవలేదు. కానీ, దేశంలో చాలా మంది డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. డీ విటమిన్ మానవ శరీరానికి ఎంతో ముఖ్యం. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచే కాల్షియంను గ్రహించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరగుదలకు సాయపడుతుంది. ఇంత ముఖ్యమైన డీ విటమిన్ను సూర్యరశ్మి పుష్కలంగా లభించే భారత్లో సులభంగానే పొందవచ్చు. అయినా మన దేశంలోనే ఎక్కువమంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఇందుకు కారణాలేంటి? దీన్ని ఎలా అధిగమించవచ్చో చూద్దాం.
ఆధునిక జీవన శైలితో..
దేశంలోని పట్టణాలు, నగరాల్లో ప్రజలు ఆధునిక జీవనశైలికి అలవాటు పడటం ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సమయం ఇంటిలో లేదా స్కూళ్లు, ఆఫీసుల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. అందువల్ల ఎండ ఎక్కువగా తగలకపోవడంతో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోందని అంటున్నారు. అంతేకాకుండా పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవడం, సన్‌స్క్రీన్ లోషన్లు వంటివి ఉపయోగించడమూ మరొక కారణం. పర్యావరణ కాలుష్యం ఇందుకూ మరొక రకంగా కారణమవుతోంది. పట్టణాల్లో పొగ, దుమ్ము ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సూర్యరశ్మి కోసం బయటికి వెళితే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ఎవరిలో ఎక్కువ?
ముదురు రంగం చర్మం ఉండే వారిలో డీ విటమిన్ అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వారి చర్మంలో మెలనిన్ స్థాయిలు ఎక్కువ. ఇది యూవీ కిరణాల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. లేత రంగు చర్మం ఉన్నవారితో పోలిస్తే వీరిలోనే డీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.
ఈ లోపాన్ని అధిగమించాలంటే..
డీ విటమిన్ సమృద్ధిగా లభించే ఆయిల్ ఫిష్, గుడ్డు సొన, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని భారతీయులు తగినంత తీసుకోకపోవడమే డీ విటమిన్ లోపానికి ప్రధాన కారణమని అంటున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సూర్యరశ్మి మంచిగా వచ్చే ఆరుబయట కొద్ది సేపు ఉండటం మంచిది. ఉదయం 10 గంటలలోపు లేదా మధ్యాహ్నం 3 గంటల సమయంలో మన శరీరాన్ని సూర్యరశ్మి తాకేలా చూసుకోవాలి.