ఈ వీక్ డిజిటల్ వేదికగా అలరించనున్న చిత్రాలు, సిరీసులు ఇవే..

20 December 2024

Battula Prudvi

సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ ఆహా వేదికగా ఈ నెల 20 నుంచి ప్రసారం కానుంది.

‘ట్విస్టర్స్’ అనే డిజాస్టర్ నేపథ్యంలో రూపొందిన అమెరికన్ చిత్రం ఈ నెల 18 నుంచి జియో సినిమా వేదికగా స్ట్రీమ్ అవుతుంది.

‘ద సిక్స్‌ ట్రిపుల్‌ ఎయిట్‌’ అమెరికన్ వార్ డ్రామా మూవీ డిసెంబరు 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారనికి సిద్ధమైంది.

హాలీవుడ్ అమెరికన్ కామెడీ డ్రామా చిత్రం ‘తెల్మా’ డిసెంబరు 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవ్వనుంది.

ప్రీతి పాణిగ్రాహి, కని కస్రుతి, కేశవ్ బినోయ్ కిరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘గర్ల్స్ విల్ బి గర్ల్స్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 22న స్ట్రీమ్ కానుంది.

షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన షణ్ముఖ్‌ జస్వంత్‌  ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘లీలా వినోదం’ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

‘ది డ్రాగన్‌ ప్రిన్స్‌’ వెబ్‌సిరీస్‌ చివరి సీజన్ డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శించబడుతుంది.

‘మూన్‌వాక్‌’ అనే ఓ హిందీ కామెడీ డ్రామా వెబ్‌సిరీస్‌ డిసెంబరు 20 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.