కలువ వంటి కన్నులు.. జాబిల్లి వంటి రూపు ఈమె సొంతం.. క్యూటీ నయన్ సారిక..

18 December 2024

Battula Prudvi

23 అక్టోబర్ 2001న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‎ మహానగరంలో జన్మించింది అందాల ముద్దుగుమ్మ నయన్ సారిక.

తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచేసిన ఈ వయ్యారి భామ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.

ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గం గం గణేశా'లో ఓ పాత్రలో తొలిసారి తెలుగు తెరపై కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్‎గా సిల్వర్ స్క్రీన్‎కి పరిచయం అయింది మాత్రం ఈ ఏడాది ఆగష్టు 15న 'ఆయ్' సినిమాతో.. తొలి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 12 నుంచి సోనీలివ్‎లో ప్రసారం అవుతున్న 'బెంచ్ లైఫ్' వెబ్‎సిరీస్‎లో గాయత్రీ పాత్రలో కనిపించింది.

దీపావళి కానుకగా వచ్చిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'క' సినిమాలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా ఆకట్టుకుంది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి ఏడాదిలోనే మూడు హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈమె నటించిన వెబ్‎సిరీస్‎కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసిన ఈ కలువ కన్నుల భామ బియోగ్రఫీని ఇంటర్నెట్‎లో తెగ సెర్చ్ చేస్తున్నారు టాలీవుడ్ ఫ్యాన్స్.