2025లో శక్తి రూపిణీగా మారనున్న ముద్దుగుమ్మలు వీరే.. 

17 December 2024

Battula Prudvi

లేడీ లక్‌ అనుష్క ఈ ఏడాది స్క్రీన్‌ మీద కనిపించలేదు. 2025లో ఏప్రిల్ 18న ‘ఘాటీ’ సినిమాతో తన నట విశ్వరూపం చూపించనుంది.

‘కథనార్‌’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో 2025లో తన అభిమానులను ఫుల్ ట్రీట్ ఇవ్వనుంది టాలీవుడ్ జేజమ్మ.

రష్మిక మందన్న 2025లో ‘ది గ‌ర్ల్ ప్రెండ్’ అనే ఓ లేడీ ఓరియెంటెడ్ రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగా కోడ‌లు లావ‌ణ్య త్రిపాఠి 2025లో ఫిమేల్ సెంట్రిక్ మూవీతో రానుంది. ‘స‌తీ లీలావ‌తి’ అనే చిత్రానికి సైన్ చేసింది.

నయనతార నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రక్కయి’తో  2025లో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతుంది.

సంయుక్తా మీన‌న్ కూడా యేగేష్ అనే కొత్త యంగ్ దర్శకుడితో ఓ లేడీ ఓరియేటెండ్ సినిమాకు అగ్రిమెంట్ చేసుకుంది.

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే సైతం త‌మిళ్ డైరెక్ట‌ర్ అజ‌య్ జ్ఞాన‌ముత్తుతో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి పచ్చ జంట ఊపింది.

రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో అఘోష్ వైష్ణవం తెరకెక్కిస్తున్న ‘సారీ’ అనే లేడీ ఓరియెంటెడ్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం 2025లో రానుంది.